ఇండియల్ ఐడల్ తెలుగు తేజం.. నెక్స్ట్ టార్గెట్ ఏంటో తెలుసా? | Indian Idol Revanth target fixed.

Singer revanth wins indian idol 9

LV Revanth, Singer Revanth, Indian Idol season 9, Indian Idol season 9 Winner, Indian Idol 9 Winner, Indian Idol Telugu, Telugu Singers Indian Idols, Singer Revanth Bollywood, Singer Revanth Dream, Indian Idol Winner, Indian Idol Winner Revanth, Singer Revanth Life, Tollywood Singer Revanth

LV Revanth wins Indian Idol 9, now wants to learn Hindi and make it big in Bollywood

ఇండియన్‌ ఐడల్‌ విన్నర్ గా రేవంత్‌

Posted: 04/03/2017 08:45 AM IST
Singer revanth wins indian idol 9

ఎల్ వీ రేవంత్, సౌత్ ఇండియన్ యువ సింగర్ ఇండియన్ ఐడల్ అనే ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక అతని ముందు ఉన్న పెద్ద పని ఏంటో తెలుసా? హిందీ స్పష్టంగా నేర్చుకుని బాలీవుడ్ లో రాణించటమే. ఈ మాట అంటుంది ఎవరో కాదు గత రాత్రి జరిగిన ఇండియన్ ఐడల్ సీజన్ -9 ఫైనల్ లో విజేతగా నిలిచిన మన తెలుగు తేజమే.

మరోసారి ఇండియన్‌ ఐడల్‌ కిరీటం తెలుగువారి సొంతమైంది. గతంలో శ్రీరామచంద్ర ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌– 5 టైటిల్‌ గెలుచుకున్నాడు. బాహుబలి లో మనోహరి గాయకుడిగా గుర్తింపు పొందిన తెలుగు కుర్రాడు ఉత్తరాది వారికి మాత్రం అంతగా పరిచయం లేడు. ఒకానోక దశలో హిందీ స్పష్టంగా మాట్లాడలేడు వేస్ట్ అంటూ కొందరు పెదవి విరిచేశారు. అయినా సరే తన గానమాధుర్యంతో జనాలతోపాటు జడ్జిలను మెప్పించి ఇండియన్ ఐడల్ గా నిలిచాడు.

మరో ఇద్దరు పోటీదారులు పీవీఎన్‌ఎస్‌ రోహిత్, ఖుదా భక్ష్‌లతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో సత్తా చాటాడు. క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ నుంచి ఇండియన్‌ ఐడల్‌ ట్రోఫీని అందుకున్నాడు. ఫైనల్ లో చక్‌దే సినిమా నుంచి ‘మర్‌ జాయోన్‌..’ పాట పాడి సైనికులకు అంకితమిచ్చాడు. ‘లడ్కీ కా గయీ చుల్‌’ పాట పాడుతూ యువతులతో డ్యాన్స్‌ చేస్తూ ఆకట్టుకున్నాడు.

ఇక విజేతగా నిలిచిన రేవంత్ కు ఇండియన్‌ ఐడల్‌ కిరీటంతో పాటు యూనివర్సల్‌ మ్యూజిక్‌ కంపెనీతో ఒప్పందం, రూ. 25 లక్షల నగదు బహుమతిని రేవంత్‌ గెలుచుకున్నాడు. రోహిత్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు.

రేవంత్ కెరీర్ సాగిందిలా... 

లోలా వెంకట రేవంత్ కుమార్ శర్మ ఫిబ్రవరి 10, 1990 శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు. ఇతని పుట్టడానికి కొద్దిరోజుల ముందే తండ్రి చనిపోయాడు. తల్లి కష్టం, అన్నయ్య ప్రోత్సాహంతో సింగర్ గా ఎదిగేందుకు హైదరాబాద్ కు వచ్చాడు. 2008 లో వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చిన మహా యజ్నం అనే సినిమాలో జలక్ దిక్ లాజా అనే పాటతో ఆరంగ్రేటం చేశాడు. ఆపై ఎంఎం కీరవాణి దగ్గర శిష్యరికం చేస్తూ సుమారు 200 పాటలు పాడాడు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో దాదాపు 200 పాటలు పాడిన రేవంత్‌కు ఈగ, బాహుబలి ది బిగినింగ్ లోని మనోహరి పాట పాపులారిటీతోపాటు అవార్డును కూడా తీసుకొచ్చింది. ఓవైపు సింగర్ గా కొనసాగుతూనే కొన్ని టీవీ షోలలో పార్టిసిపేట్ గా, యాంకర్ గా అలరించాడు రేవంత్. ఇక బాలీవుడ్ లో పాగా వేయటమే తన ముందు ఉన్న మొదటి పని అని చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singer Revanth  Indian Idol season 9  Winner  

Other Articles