బాహుబలి సక్సెస్ పిచ్చ లైట్.. సీనియర్ హీరోకి సెటైరా? | Baahubali success not influenced Prabhas.

Prabhas on baahubali character influence

Baahubali Influence, Baahubali Character, Prabhas on Baahubali Success, Prabhas Latest Interview, Prabhas Baahubali 2 Interview, Prabhas Satire Senior Hero, Prabhas Raj, Prabhas Balayya, Prabhas Satire

Baahubali not influenced Actor Prabhas personal life. He is a switch-off and switch-on actor who doesn’t carry the load of the characterization of his roles. If the baggage of ‘Baahubali’ stays with him, “I should have to live with this character for the rest of my life,” he added.

బాహుబలి జస్ట్ ఓ క్యారెక్టర్ : ప్రభాస్

Posted: 03/07/2017 11:17 AM IST
Prabhas on baahubali character influence

కెరీర్ చక్కబెట్టుకునే క్రమంలో ఏ హీరో కూడా చేయని గట్స్ ప్రదర్శించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సీనియర్లు హెచ్చరిస్తున్నా వినకుండా నాలుగేళ్లు పూర్తిగా ఓ ప్రాజెక్టు కోసమే కేటాయించటం అంటే మాములు విషయం కాదు. అయితే ఆ నమ్మకం కాస్త కూడా వృథా కాలేదు. అంతర్జాతీయ మాగ్జైన్ లలో సైతం స్పెషల్ ఆర్టికల్స్ వచ్చాయంటే ప్రభాస్ ఇప్పుడు ఖచ్ఛితంగా ఓ నేషనల్ స్టారే.

సాధారణంగా పాత్రలను దత్తత తీసుకునే నటులు, ముఖ్యంగా ఇలాంటి జానపద నేపథ్యం ఉన్న కథలను ఎంచుకునే హీరోలు పరకాయ ప్రవేశం చేసి అందులోకి ఒదిగిపోవటం చూస్తుంటాం. కొన్నిసార్లు బయటకూడా వాళ్లు అలా బిహేవ్ చేయటం కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. మరి ప్రభాస్ కూడా అలాంటి బాపతేనా?. ఈ ప్రశ్నను అతడినే అడిగితే ఎంత మాత్రం కాదంటున్నాడు. నటన కోసం కేవలం క్యారెక్టర్ ను ఫాలో అవుతానే తప్ప.. రియల్ లైఫ్ లో ఆ ఎఫెక్ట్ తన రియల్ లైఫ్ లో ఎంత మాత్రం ఉండదని ఓపెన్ గా చెబుతున్నాడు.

బాహుబలి క్యారెక్టర్ తోనే లైఫ్ లాంగ్ ఉండిపోవాలనుకుంటే... ఇక మిగతా సినిమాలు చేయటం ఎందుకు? సినిమా సినిమాకు హీరోలు మారాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఒకే పాత్రను కంప్లీట్ గా క్యారీ చేయటం చాలా కష్టం. అంతేకాదు ప్రేక్షకులనే ప్రభావితం చేయాలే తప్ప, మనం కాకూడదంటూ వ్యాఖ్యానించాడు కూడా. అందుకే సినిమా కోసం ఎంత కష్టపడ్డప్పటికీ, షూటింగ్ అయిపోగానే నార్మల్ మోడ్ లోకి వచ్చేస్తుంటా అని చెబుతున్నాడు డార్లింగ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali Hero  Prabhas Interview  

Other Articles