మాస్ రాజా మైండ్ లో ఎన్నో థాట్లు.. వర్కవుట్ అయ్యేనా? | Mass Raja so many thoughts in Mind.

Ravi teja interacts with fans in twitter

Ravi Teja Direction, Ravi Teja Negative Roles, Mass Raja Twitter, Ravi Teja Twitter Interaction, Ravi Teja Direction, Mass Raja Ravi Teja, Ravi Teja Pawan kalyan, Ravi Teja NTR Multi Starer Movie

Hero Ravi Teja recently interacts with fans. Mass Raja says he is ready for Multi Starer movies and also eagerly waiting for negative roles. While asking about direction plans it was under process.

నెగటివ్ రోల్స్, మల్టీ స్టారర్లపై మాస్ రాజా

Posted: 03/04/2017 03:05 PM IST
Ravi teja interacts with fans in twitter

దాదాపు 448 రోజులు థియేటర్లకు దూరమైన మాస్ రాజా రవితేజ ఈ మధ్యే రెండు సినిమాలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు కొత్తగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన ఈ హీరో ఇప్పుడిప్పుడే అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఏనాడూ లేని విధంగా ఫ్యామిలీ ఫోటోలు పెట్టి ఫ్యాన్స్ కు కిక్కు అందించాడు.

ప్రస్తుతం టైం దొరికొతే చాలూ ఫ్యాన్స్ తో చాటింగ్ చేస్తూ వారి క్వశ్చన్స్ కు చాలా ఓపికగా ఆన్సర్లు ఇస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం కూడా కాసేపు అలా అభిమానులతో ట్విట్టర్లో ముచ్చటించాడు కూడా. వారడిన అన్ని ప్రశ్నలకు సింపుల్ గా సమాధానిలిచ్చేశాడు కూడా. ఓ అభిమాని ఆయ‌న‌ను డైరెక్షన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అని అడిగాడు. దానికి స్పందించిన రవితేజ తప్పక చేస్తాన‌ని, అయితే, తాను ఆ అవ‌తారం ఎప్పుడు ఎత్తుతానో తెలియ‌ద‌ని చెప్పాడు. ఇంకోవైపు నెగటివ్ రోల్స్, మల్టీస్టారర్ మూవీస్ గురించి పాజిటివ్ రెస్పాండ్ అయిన ర‌వితేజ సైకో పాత్ర మాత్రం చచ్చినా చేయనని తేల్చేశాడు. మహేష్, ఎన్టీఆర్, సమంత-నాగ చైతన్య ఇలా పలువురి సెలబ్రిటీల గురించి కూడా సమాధానాలిచ్చాడు.

 

ప్రస్తుతం ర‌వితేజ దూకుడు పెంచి 'టచ్ చేసి చూడు', 'రాజా ది గ్రేట్' అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో అల్రెడీ టచ్ చేసి చూడు అల్రెడీ షూటింగ్ జరుపుకుంటుండగా, అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ రెండింటిలో ఏది ముందు రిలీజ్ అవుతుందన్న దానిపై తనకు కూడా క్లారిటీ లేదని చెప్పేశాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Ravi Teja  Twitter Interaction  Direction plans  

Other Articles