మహేష్ మళ్లీ కన్ఫూజ్య్.. డేట్ ఫిక్స్ కానీ మళ్లీ కొత్త టైటిలా? ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు | Mahesh Babu Murugadoss movie new title consider.

Marmam title consider for mahesh babu

Marmam Movie, Mahesh Babu New Title, Mahesh Babu Marmam Title, Mahesh Murugadoss Title, New Title Mahesh Babu, Mahesh Murugadoss Movie Release Date, Mahesh Babu New Photos, Mahesh Babu New Movie, Mahesh babu Release Date, Mahesh Babu Ajith

Mahesh Babu AR Murugadoss movie get new title. "Marmam" consider for this crazy project. Release date already set on June 23rd.

మహేష్-మురగదాస్ మళ్లీ టైటిల్ మార్చారా?

Posted: 03/04/2017 03:48 PM IST
Marmam title consider for mahesh babu

పేరుకు సూపర్ స్టార్ సినిమా అయినా ఇప్పటిదాకా టైటిల్ విషయంలో ఎలాంటి ప్రోగ్రెస్ లేకుండా ఉన్నాడు దర్శకుడు మురగదాస్. బైలింగువల్ ప్రాజెక్టు కావటం, పైగా మహేష్ లాంటి సౌత్ స్టార్ హీరో కావటంతో సినిమాపై అంచనాలు అలానే ఉన్నప్పటికీ, ఎందుకో ఫస్ట్ లుక్ విషయంలోనే నిరుత్సాహ పరుస్తున్నాడు. ఇప్పటిదాకా రకరకాల టైటిళ్లు వినిపించి, చివరకు సంభవామీ యుగే యుగే అంటూ పీవీపీ స్టేట్ మెంట్ తో అదేనంటూ ఫిక్సయిపోయారంతా.

కానీ, రీసెంట్ గా మర్మం అనే మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చి మళ్లీ కథను మొదటికి తెచ్చింది. మరో రెండు వారాల్లో ఇదే టైటిల్ ను మేకర్లు అనౌన్స్ చేస్తారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఈ టైటిల్ ఎంత వరకు ఆప్ట్ అవుతుందనేది ఫ్యాన్స్ ను ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న. ఈ విషయంలో ఈ కన్ఫూజన్ ఇంకా కొనసాగుతునప్పటికీ, రిలీజ్ విషయంలో మాత్రం ఓ గుడ్ న్యూస్.

 

జూన్ 23న ఈ చిత్రం రిలీజ్ అవుతుందని ఇదివరకే దర్శకుడు మురగదాస్ అఫీషియల్ గా ట్విట్టర్ లో చెప్పాడు కదా. అయితే అదే సమయానికి అజిత్ వివేగమ్ విడుదల కావాల్సి ఉంది. దీంతో ఈ ఇద్దరు సూపర్ స్టార్లకు పోటీ తప్పదని అంతా అనుకున్నారు. కానీ, ఆ చిత్రాన్ని ఆగష్టుకు పోస్ట్ పోన్ చేయటంతో ఇప్పుడు ప్రిన్స్ ఫ్యాన్స్ పండగ చేస్కుంటున్నారు. రకుల్ హీరోయిన్ గా ఎస్ జే సూర్య నెగటివ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ఇంకా 40 రోజుల షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Murugadoss Movie  Release Date  Marmam Title  

Other Articles