కాళ్లు కడిగి పెళ్లి చేశాడంట!.. అయినా గొడవ ఎందుకు అయ్యిందంటే.. | Raja Ravindra No Financial Clashes with Mass Raja.

Raja ravindra about clash with ravi teja

Actor Raja Ravindra, Ravi Teja, Ravi teja Raja Ravindra, Raja Ravindra about Chiranjeevi, Raja Ravindra Interview, Ravi Teja Clash, Hero Ravi Teja, Raja Ravindra as Manager, Tollywood Manager Raja Ravindra, Hero Manager Cheat

Actor Raja Ravindra about clash with Ravi Teja. Clarified that no financial matters reason for their gap.

రవితేజతో గొడవ గురించి రాజా రవీంద్ర

Posted: 02/28/2017 04:01 PM IST
Raja ravindra about clash with ravi teja

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన రాజా రవీంద్ర ఆ తర్వాత తక్కువ టైంలోనే మంచి రోల్స్ చేశాడు. హీరో ఫ్రెండ్స్ గా, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఎక్కువగా మెరిసిన ఆయన ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేశారు. ప్రస్తుతం జయసుధ, రాజ్ తరుణ్, విష్ణు, నిఖిల్, సునీల్ ల మేనేజర్ గా వాళ్ల డేట్స్ చూసుకుంటూ, చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తున్నాడు. పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ మంచి రోల్స్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే తాను సినిమాలు కమిట్ కావటం లేదని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు. ఇదే సమయంలో మాస్ రాజా రవితేజతో ఉన్న విభేధాల గురించి కూడా ఓపెన్ అయ్యాడు.

గతంలో రాజా రవీంద్ర రవితేజకు మేనేజర్ గా వ్యవహరించాడు. కాల్షీట్ల దగ్గరి నుంచి రెమ్యునరేషన్ దాకా అన్నీ అతనే చూసుకునేవాడు. కానీ, ఏమైందో ఏమో తెలీదుగానీ వీరిద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చి విడిపోయారు. అయితే ఆర్థిక వ్యవహారాల కారణంగానే అది జరిగిందని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. అయినప్పటికీ అడపా దడపా కొన్ని సినిమాల్లో వీరు కలిసి నటించారు కూడా.

 

కట్ చేస్తే.. ఆరేళ్ల తర్వాత అంటే ఇప్పుడు ఆ గొడవపై రాజా రవీంద్ర స్పందించాడు. చాలా మంది అనుకుంటున్నట్టు హీరో రవితేజకు, తనకు మధ్య ఎలాంటి ఆర్థిక విభేదాలు లేవని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర తెలిపాడు. రవితేజతో సినిమాల్లోకి రాకముందు నుంచే తనకు చాలా సాన్నిహిత్యం ఉండేదని... పైగా అతని కాళ్లు కడిగి తానే పెళ్లి చేశానని చెప్పాడు. అసలు తనను మేనేజర్ ను చేసిందే రవితేజ అని తెలిపాడు. ఒకప్పుడు రవితేజను 'ఏరా' అని పిలిచేవాడినని... పెద్ద హీరో అయ్యాక బహుశా ఆ పిలుపు నచ్చకే తనను దూరం పెట్టి ఉండవచ్చని తెలిపాడు. ఓ రోజు తనను పిలిచి ఇక తన వ్యవహారాలను తానే చూసుకోగలనని చెప్పటంతో అప్పటి నుంచి మానేశానని చెప్పాడు. ఇప్పటికీ రవితేజ తన ఇంటికి వస్తుంటాడని తెలిపిన రవీంద్ర ఆర్థిక వ్యవహారలన్నీ రవితేజే చూసుకునేవాడని, అలాంటప్పుడు సమస్య ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Raja Ravindra  Hero Ravi Teja  Interview  

Other Articles