బాహుబలి-2 జక్కన్నది ఓ మాట.. నిర్మాతలది మరో మాట. సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా? | Makers of Baahubali-2 on Audio Date and Venue.

Baahbali 2 audio release date fixed

Baahubali The Conclusion Audio, Baahubali-2 Audio Release, Baahubali-2 Audio Venue, Baahubali Ugadi, Rajamouli Baahubali 2 Teaser, Baahubali 2 Visual Effects, Baahubali 2 Vizag

On Ugadi festival day, Baahubali The Conclusion's audio will be launched. As per sentiment, Tirupathi is being considered as the venue. The first part's audio was released in Tirupathi city. So, Prabhas's fans are asking to choose the same venue as per the lucky sentiment. But the team of 'Baahubali 2' is thinking of changing the venue for this part. Vizag is one option they are looking at. As of now date has been fixed but venue has not been decided yet. A final call will be taken in the first week of March.

బాహుబలి-2 ఆడియో రిలీజ్ డేట్.. వేదిక ఎక్కడా?

Posted: 02/28/2017 04:19 PM IST
Baahbali 2 audio release date fixed

గ్రాఫికల్ వర్క్ మూలంగానే బాహుబలి-2 టీజర్ లేట్ అవుతుందని రీసెంట్ గా ఓ వీడియో ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పటం చూశాం. దీంతో మార్చ్ మధ్యలో ఉంటుందన్న క్లారిటీ మాత్రం వచ్చేసింది. అయితే నెల రోజుల సమయం మాత్రం ఉండటంతో ఆడియో రిలీజ్ ఎక్కడ చేస్తారా? అన్న డౌట్లు మొదలయ్యాయి.

ఉగాది రోజున ఆడియో రిలీజ్ చేస్తారని, ఫస్ట్ పార్ట్ మాదిరిగానే దీని వేడుక కూడా తిరుపతిలోనే నిర్వహిస్తారన్న ఓ టాక్ బయలుదేరింది. సెంటిమెంట్ ప్రకారం అక్కడే నిర్వహించాలని ప్రభాస్ అభిమానులు కూడా రాజమౌళిని కొరుతున్నారు. కానీ, నిర్మాతలు మాత్రం మరోలా ఆలోచిస్తున్నారంట. తేదీ అదే అయినా వేదిక విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయం వారు ఉన్నారు.

ఫర్ ఏ ఛేంజ్ ఈసారి మాత్రం వైజాగ్ లో వేడుక నిర్వహించాలని డిసైడ్ అయ్యారంట. వేదిక విషయంలో ఇంకా స్పష్టమైన ప్రకటన రాకపోయినప్పటికీ, దాదాపు అది ఖరారయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాంటి ఆలోచన చేసినప్పటికీ, బాహుబలి విషయంలో అది అస్సలు వర్కవుట్ కాదని ఫిక్సయ్యారు. మొదటి పార్ట్ లో మిస్సయిన ఎలిమెంట్స్ ను రెండో పార్ట్ లో తప్పక చూపించి తీరతానని, కథ, యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నిరాశకు గురిచేయనని జక్కన్న ప్రామిస్ చేస్తున్నాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali-2  Audio Release  Date and Venue  

Other Articles