101 పూరీ లేదా రవి... రైతు విషయంలో భయపడ్డాడా? | Balayya drops Raithu.

Balayya new decision on 101 movie

Balakrishna 101 Movie, Balakrishna Next Movie, Balayya New Movie, Balakrishna Tamanna, Balakrishna Puri Jagannath, Balakrishna KS Ravikumar, Balakrishna Raithu Shelve, Balayya 101 Movie, Balayya Janaganamana

Nandamuri Balakrishna 101 movie on floor. He has already given confirmation to Tamil director K S Ravikumar for the producer C Kalyan. The work for this movie has already begun. "Reddy Garu" as the title and Tamannah as the heroine are being considered. On the other hand, Puri Jagannadh is said to have narrated a script to Balakrishna. If everything goes as per Puri's plan, the movie may also take place shortly. Both the movies might go for the sets on parallel.

కొత్త కథలతోనే బాలయ్య ఎందుకంటే...

Posted: 02/23/2017 03:29 PM IST
Balayya new decision on 101 movie

శాతకర్ణి సక్సెస్ తర్వాత మూడు నెలల గ్యాప్ తీసుకుని నటసింహ బాలకృష్ణ 101వ చిత్రంపై దృష్టిసారించబోతున్నాడని ఇది వరకు చెప్పుకున్నాం. కృష్ణవంశీ తో రైతు కథను అంతా ఓకే చేసి ఫైనలైజ్ అయ్యాక ఎందుకనో ఆ ప్రాజెక్టు ఒక్కసారిగా వెనక్కు వెళ్లిపోయింది. అదే టైంలో తన డ్రీమ్ ప్రాజెక్టు ఆదిత్య 999 కూడా ఆచరణకు నోచుకోకుండా పోయింది.

కారణాలేవైనా ఆ రెండు ఇప్పుడు బాలయ్య 101 చిత్రాల రేసులో లేకుండా పోయాయన్నది కన్ఫర్మ్. మరోవైపు ఇదే సమయంలో బాలయ్య రెండు కొత్త కథలకు ఓకే చెప్పటం చర్చనీయాంశంగా మారింది. అందులో ఒకటి తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఫ్యాక్షన్ కథ ‘రెడ్డిగారు’. మరోకటి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన.

స్నేహం కోసం, బావ నచ్చాడు చిత్రాల దర్శకుడు రవికుమార్ కు తెలుగులో అంతగా గుర్తింపు లేకపోయినా తమిళ్ లో మాత్రం రజనీ, కమల్ లతో బ్లాక్ బస్టర్లు సాధించాడు. అందుకే ఫాక్షన్ నేపథ్యం ఉన్న రెడ్డిగారు కథతో బాలయ్యను ఇంప్రెస్ చేశాడని, తమన్నాతోపాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్న ఈ సినిమా అతిత్వరలో షూటింగ్ ప్రారంభించుకోబోతుందని టాక్.

మరోవైపు మహేష్ బాబు తో మొదలుపెడదామని అల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేసిన పూరీ జనగణమన కథను వెంకీ దగ్గరికి బడ్జెట్ ప్రాబ్లమ్ తో అక్కడి నుంచి బాలయ్యకు వినిపించగా ఓకే అయినట్లు తెలుస్తోంది. క్రేజీ కాంబినేషన్ కావటంతో ఈ చిత్రం ఎలా ఉండబోతుందా? అని డిస్కషన్ మొదలైంది. మొత్తానికి ఒకేసారి షూటింగ్ జరుపుకోబోతున్న ఈ రెండింటిలో 101 ఏదన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదనే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Balakrishna  101 Movie  K S Ravikumar  Puri Jagannath  

Other Articles