బాహుబలి ఓ పరమచెత్త.. బన్నీకిచ్చే విలువ కూడా ఇవ్వట్లేదు | Kaikala comments on Baahubali and Allu Arjun.

Kaikala satyanarayana comments on baahubali and bunny

Veteran Actor Kaikala Satyanarayana, Kaikala Satyanarayana Baahubali, Kaikala Satyanarayana Allu Arjun, Allu Arjun Baahubali, Kaikala Satyanarayana Bunny, Kaikala Satyanarayana Baahubali, Kaikala Satyanarayana Tollywood, Kaikala Satyanarayana Interview

Veteran Actor Kaikala Satyanarayana Comments on Baahubali. Felt that for a society like us where people are suffering, to waste crores for the sake of grandeur is unnecessary. Coming to the treatment meted out to the senior artists in the film industry, veteran actor Kaikala Satyanarayana vented his displeasure on the way the film industry works. Only those who are in limelight are getting attention and seniors, who dedicated all their lives to the art are neglected.“Isn’t Allu Arjun just a hero recently?” The importance given to young heroes like Allu Arjun is more while the seniors were totally ignored said the veteran talking about the ways of the industry.

బాహుబలి, బన్నీపై కైకాల కామెంట్స్

Posted: 02/24/2017 09:05 AM IST
Kaikala satyanarayana comments on baahubali and bunny

భారీ బడ్జెట్ తో నిర్మితమై హాట్ టాపిక్ గా మారిన బాహుబలి ఆ తర్వాత ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ గ్రాండియర్ హాలీవుడ్ స్థాయికి రిచ్ అవుతుందని బహుశా ఏ తెలుగు వాడు ఊహించి ఉండడేమో. అదే ఊపుతో రెండో పార్ట్ పై కూడా అంతకు మించి అంచనాలు నెలకొన్నాయి కూడా.

అయితే మొదటి నుంచి సీనియర్ల నుంచి బాహుబలిపై వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది. జమున లాంటి కొందరు అయితే బహిరంగంగానే కామెంట్లు చేశారు కూడా. ఇక ఇప్పుడు మరో సీనియర్ నటుడు బాహుబలిపై షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అసలు బాహుబలి వల్ల ఎవరికి ఉపయోగం అంటూ వ్యాఖ్యానించాడు కైకాల సత్యనారాయణ. ఓ మెసేజ్ లేదు.. పైగా రెండు, మూడు లైన్లతో అనుకున్న కథ. కేవలం గ్రాఫిక్స్ అనే హంగుల మీద ఆధారపడి వచ్చిందంతే.. అంటూ తెలిపాడు. అనవసరమైన ఖర్చులు తప్పించి దాని వల్ల ఎవరికీ ఏం ఉపయోగం లేకుండా పోయిందని వ్యాఖ్యానించాడు. పనిలో పనిగా బిచ్చగాడు ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు ఆయన.

ఇక ఇండస్ట్రీలో సీనియర్లను సంస్కృతి కనుమరుగైపోతుందన్న ఆయన చిరు 150 ప్రీమియర్ కు పిలవకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే సమయంలో బాలయ్య సీనియర్ నటీనటుల కోసమే ప్రత్యేకంగా ఓ షో వేయటంపై ప్రశంసలు కురింపించాడు. ఇక ఈవెంట్లకు, అవార్డు పంక్షన్ లకు ఆహ్వానం అందటం లేదని చెప్పిన ఆయన, అల్లు అర్జున లాంటి కుర్రహీరోలకు ఇచ్చేపాటి గౌరవ మర్యాదలు కళామ్మ తల్లి కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డ తనలాంటి వాళ్లకు ఇవ్వకపోటం దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaikala Satyanarayana  Baahubali  Allu Arjun  Tollywood Culture  

Other Articles