ఆ పడక సుఖమే ఇంత దాన్ని చేసిందన్న ఇలియానా | Ileana Shared an emotional Valentines day Message.

Ileana d cruz feels thankful for everything

Ileana D'Cruz Family, Ileana Instagram, Ileana About Family, Ileana Shared Video, Ileana Emotional Video, Ileana Valentines Day Message, Ileana Thanks to family, Ileana Thanks Video, Ileana Healthy Body Great Job Amazing Family, Ileana D'Cruz

Ileana wrote on her Instagram page on Monday: "Although work keeps me away from them, I'm thankful for a beautiful family. There are days I do not want to get out of bed just because I want another hour of sleep, I'm thankful; I have the luxury of a healthy body, a great job and an amazing family."

ఇలియానా ఇలా ఉందంటే వాళ్ల దయేనంట!

Posted: 02/13/2017 05:51 PM IST
Ileana d cruz feels thankful for everything

చివరి సారిగా అక్షయ్ కుమార్ తో రుస్తుం లో కనిపించిన ఇలియానకు జస్ట్ రెండు సినిమాలే చేతిలో ఉన్నాయి. అయితేనేం బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ అడపా దడపా హాట్ ఫోటోలతో సందడి చేస్తోంది. అన్ని రోజులు ఒకేలా ఉండవంటూ వేదాంతం చెబుతూ పనిలో పనిగా తాను లైఫ్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని అంటోంది. మరి కొంచెం కూడా బోర్ కొట్టడం లేదా? అంటే తన లాంటి ఫ్యామిలీ ఉంటే ఎవరైనా సంతోషంగానే ఉంటారని చెబుతోంది.

సోమవారం తన ఇన్ స్టాగ్రామ్ లో ఇల్లీ బేబీ చాలా విషయాలే చెప్పుకొచ్చింది. షూటింగ్ లతో దూరంగా ఉన్నప్పటికీ నాకు ఓ అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చాడు ఆ దేవుడు. ఆలస్యంగా బెడ్ దిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి సమయంలో నా కుటుంబ సభ్యులు నాకు చివాట్లు పెట్టకుండా వదిలేసేవారు. అలా నా ఇష్టానుసారం నన్ను వదిలేయటం మూలంగానే ఇంత ఆరోగ్యకరమైన శరీరం నా సొంతం అయ్యింది. వారికి నా జన్మంతా రుణపడి ఉంటా అంటూ తల్లిదండ్రులపై కృతజ్నత చూపించింది. దీంతో ఇలియానాలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటు కామెంట్లు పెడుతున్నారు.

తెలుగులో దేవదాస్ తో ఆరంగ్రేటం చేసి ఆపై పోకిరి, జల్సా, కిక్కు సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో బాలీవుడ్ కు చెక్కేసి అక్కడే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీల బాద్ షావో, అనిల్ కపూర్-అర్జున్ కపూర్ ల ముబారకన్ సినిమాల్లో నటిస్తోందీ బెల్లీ బ్యూటీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ileana D'Cruz  Valentines Day  Video  Instagram  

Other Articles