యాంకర్ ఉదయభాను కవల పిల్లలు ఇదిగో.. రిటైర్ మెంట్ ఇచ్చేసిందా? | Udaya Bhanu daughters pic viral.

Anchor udaya bhanu daughters photo revealed

Anchor Udaya Bhanu, Udaya Bhanu Twin Daughters, Udaya Bhanu Husband, Anchor Udaya Bhanu family photo, Udaya Bhanu daughters, Actress Udaya Bhanu Daughters, Yuvi Nakshatra and Bhoomi Aaradhya, Udaya Bhanu Daughters Name, Udaya Bhanu Vijay Kumar

Anchor Udayabhanu named her daughters as Yuvi Nakshatra and Bhoomi Aaradhya. Photos Viral in social media.

ఉదయభాను కూతుళ్ల ఫోటో పెట్టేసింది

Posted: 01/24/2017 11:33 AM IST
Anchor udaya bhanu daughters photo revealed

తెలుగు బుల్లితెరలో ఇప్పటితరం యువత అనసూయ, రష్మీ, శ్రీముఖి అంటూ అలవాటు పడిపోయినప్పటికీ, సుమ, ఝాన్సీ లాంటి సీనియర్లు కూడా మరోవైపు తమ సత్తా చాటుతూనే ఉన్నారు. అయితే వీరందరికంటే ముందుగానే ఎంట్రీ ఇచ్చి రియాల్టీ షోలతో సత్తా చాటింది ఉదయ భాను. హృదయాంజలి, వన్స్ మోర్ ప్లీజ్ అంటూ నేరుగా జనాల దగ్గరికి రీచ్ అయ్యే కార్యక్రమాలతో ఆకట్టుకుంది.

మధ్యలో అడపా దడపా సినిమాలు చేసినప్పటికీ, ఆపై పూర్తిగా యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి, డాన్స్ షోలలో యాంకరింగ్, ఐటెం సాంగ్ ల వైపు మళ్లీంది. అయితే ఏడాదిన్నరగా మాత్రం ఆయన పూర్తిగా కనిపించకుండా పోయింది. అనూహ్య పరిస్థితిల్లో చిన్నతనంలోనే వివాహం, ఆపై విడాకులు తీసుకున్న ఉదయభాను. ఆపై 2004 లో తల్లిని ఎదిరించి మరీ విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని వార్తల్లోకి ఎక్కింది. పరిస్థితులు సర్దుమణిగాక అంతా హ్యాపీగా ఉండటంతో అలా 12 ఏళ్లపాటు యాంకరింగ్ లోనే కొనసాగింది. చివరకు ఏడాదిన్నరగా టీవీ కి దూరమై పూర్తిగా ఫ్యామిలీకే సమయాన్ని కేటాయించింది.

గత ఆగష్టు 28న ఈ యాంకర్ కవలలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కూడా లో-ఫ్రోఫైల్ మెయింటెన్ చేస్తూనే ఉంది. రీసెంట్ గా ఆమెతో ముచ్చటించిన కొందరు మీడియా వాళ్లకి వాళ్ల ఫోటోలను ఇలా చూపించేసింది. యువీ నక్షత్ర, భూమి ఆరాధ్య అనే పేర్లు పెట్టినట్లు కూడా చెప్పేసింది. కొద్ది రోజులు పిల్లలతో గడిపాక తిరిగి మేకప్ వేసుకునే ఫ్లాన్ లో ఉందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu Anchor  Udaya Bhanu  Daughters  

Other Articles