త్రిష చేతి దూల ఎంత పని చేసిందో... బండ బూతులు.. దెబ్బకి ట్విట్టర్ క్లోజ్ | Trisha trolled by fans in Twitter against Jallikattu comments.

Trisha jallikattu tweets land her into troubles

Actress Trisha, Jallikattu Comments, Trisha PETA, Trisha apology, Trisha Jallikattu tweets, Trisha Controversy, Trisha Tamil Nadu, Actress Trisha Jallikattu, Actress Trisha Tamil Nadu politics, Actress Trisha twitter, Trisha Twitter hack, Trisha Tamil culture, Trisha Twitter Deactivate

Trisha apologized on jallikattu comments, "I am a proud Tamilian and I respect in Tamil culture and tradition". Trisha Twitter hacked.

అకౌంట్ హ్యాకింగ్, ట్వీట్లు... చెప్పేది కరక్టేనా?

Posted: 01/16/2017 12:07 PM IST
Trisha jallikattu tweets land her into troubles

త్రిష తన చేతి దూలకు(ట్వీట్లు) ఇప్పుడు చింతిస్తోంది. పెటా సభ్యురాలిగా ఉన్న ఈ డస్కీ బ్యూటీ మొన్నామధ్య జల్లికట్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జంతు ప్రేమను చూపించుకునే పనిలో భాగంగా జల్లికట్టు క్రీడను త్రిష వ్యతిరేకిస్తున్నట్లుగా ట్వీట్లు చేసిందంటూ పెను దుమారమే రేగింది. తమిళనాట సెంటిమెంటుగా మారిన జల్లికట్టు క్రీడను త్రిష వ్యతిరేకిస్తున్నట్లుగా పెద్ద ప్రచారం జరగడంతో ఆమె తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుంది. షూటింగ్ స్పాట్లో ఆమెపై కొందరు దాడికి కూడా యత్నించారు.

దీనికి తోడు మొన్న శనివారం రాత్రి త్రిష ట్విట్టర్ అకౌంట్లోంచి రెండు వివాదాస్పద ట్వీట్లు ఊడిపడ్డాయి. అంతే తమిలుల మనోభావాలు దెబ్బతీసిందంటూ ఆమె పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతే కాదు పెటా నుంచి బయటకు వచ్చేయాలంటూ అల్టిమేటం కూడా జారీ చేశారు. అయితే తన ట్విట్టర్ అకౌంటును ఎవరో హ్యాక్ చేసి.. ఈ ట్వీట్లు పెట్టారని.. తనకు ఆ ట్వీట్లతో సంబంధం లేదని అంటోంది త్రిష. తన అకౌంట్ హ్యాక్ అయిన నేపథ్యంలో ట్విట్టర్ కు దూరమవుతున్నట్లు కూడా ఆమె ప్రకటించింది.

ఆ వెంటనే మీడియాకు ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది. తాను ఈ తమిళ గడ్డపైనే పుట్టానని చెప్పుకోచ్చిన త్రిష, ఎంతో గర్విస్తున్నానని, తాను ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించలేదని, ఒకవేళ అలాంటిదే జరిగి ఉంటే క్షమించాలని పేర్కొంది. అభిమానులతోసహా ఎంతో మంది తన ట్విట్టర్ లో బూతు పురాణం వల్లేశారని చెప్పుకోచ్చిన ఈ టాప్ హీరోయిన్, ఆ ట్వీట్లు కూడా అకౌంట్ హ్యాక్ చేసి ఎవరో పెట్టారని తెలిపింది. పాస్ వర్డ్ వెంటనే మార్చేసి డీ యాక్టివేట్ చేశానని తెలిపింది. దీని వెనుక ఉంది ఎవరో కారణం తెలిసే దాకా తాను అకౌంట్ ను మళ్లీ ఓపెన్ చేయనని చెప్పుకొచ్చింది.

కాగా, సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా త్రిషకు 3 మిలియన్ ఫాలోవర్ల ఉండగా, అనుకోని పరిణామాలతో దూరం కావటం విశేషం. మరోవైపు జల్లికట్టుపై కోలీవుడ్ అంతా మద్ధతు పలికిన నేపథ్యంలో ఇలాంటి స్టేట్ మెంట్లు అవసరమా? అంటూ త్రిషపై తిట్లు పడుతున్నాయి. ఇక తమిళ సంప్రదాయాలను గౌరవించని ఏ నటీనటులనైనా అడ్డుకుంటామని తమిళ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Jallikattu  Tamil culture  Controversy  twitter  Deactivated  

Other Articles