ఇద్దరూ ఇద్దరే... కలెక్షన్ల కుమ్ముడు మాములుగా లేదు | Khaidi No 150 and Satakarni Collections in overseas.

Khaidi and satakarni collections report

Chiranjeevi Khaidi No 150, Gautamiputra Satakarni, Satakarni weekend collections, Khaidi No 150 weekend collections, Satakarni and Khaidi weekend collections, Khaidi and Satakarni collections, Khaidi No 150 overseas, Chiru Balayya movies, Yollywood 2017 Sankranti Collections

Chiranjeevi Khaidi No 150 and Bala Krishna Gautamiputra Satakarni weekend collections report.

చిరు-బాలయ్య కుమ్ముకుంటున్నారే!

Posted: 01/16/2017 11:26 AM IST
Khaidi and satakarni collections report

అంతా ఊహించినట్లుగానే.. అభిమానుల దాహం తీరుస్తూ... కాదు, కాదు... బాక్సాఫీస్ లు షేక్ అయిపోయేలా ఇద్దరు సీనియర్ హీరోలు అసలైన పండగ మజాను అందజేస్తున్నారు. ఒకరేమో మాస్ రీఎంట్రీ, మరోకరేమో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ మైలురాయిలను అంతే అదిరిపోయే విక్టరీలతో అందుకున్నారు. మౌత్ పబ్లిసిటీతో పాటు.. పాజిటివ్ రివ్యూలు భారీ వసూళ్లకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఇద్దరూ యుఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేసేయటం అంటే మాములు విషయం కాదు.

మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఆదివారంకి 2 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టగా.. నటసింహ నందమూరి బాలకృష్ణ ఎపిక్ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మిలియన్ మార్కును దాటేసింది. చిరు సినిమా దాదాపు 200 స్క్రీన్లలో రిలీజైంది అమెరికాలో. మంగళవారం ప్రిమియర్లతోనే 1.25 మిలియన్ల దాకా వసూలు చేసిన ‘ఖైదీ నెంబర్ 150’.. తర్వాత కొంచెం నెమ్మదించింది. శని ఆదివారాల్లో మళ్లీ పుంజుకుని 2 మిలియన్ మార్కును అందుకుంది. ఈ సినిమా ఫుల్ రన్లో 2.5 మిలియన్ డాలర్ల మార్కును దాటొచ్చు.

Khaidi No 150 overseas collections

మరోవైపు బాలయ్య కు మల్టీఫ్లెక్సుల్లో ఆదరణ కాస్త తక్కువగా ఉండేది. కానీ, కథ, పైగా క్రిష్ డైరక్షన్, అంతకంటే ఎక్కువ బిజినెస్ భారీగా జరగటంతో దాదాపు 120 స్క్రీన్లలో రిలీజైంది. బాలయ్య సినిమా బుధవారం  ప్రీమియర్ల ద్వారా 3.5 లక్షల డాలర్ల దాకా వసూలు చేసింది. తర్వాత కూడా స్టడీగా కలెక్షన్లు రాబడుతూ ఆదివారం మిలియన్ మార్కును దాటేసింది. బాలయ్యకు అమెరికాలో ఇది తొలి మిలియన్ డాలర్ మూవీ కావడం విశేషం. ఇప్పటిదాకా ‘లెజెండ్’ సినిమా 4.1 లక్షల డాలర్లతో హైయెస్ట్ గ్రాసర్ గా కొనసాగుతూ వచ్చింది. ‘శాతకర్ణి’ ఫుల్ రన్లో 1.5 మిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకునే అవకాశముంది. నైజాంలో కూడా ఫస్ట్ డే అత్యధిక వసూలు రాబట్టం, 40 ఏళ్ళ బాలయ్య కెరీర్ లోనే ఓవరాల్ ఫస్ట్ డే కలెక్షన్లు దాదాపు 19 కోట్లు రాబట్టిన సినిమాగా శాతకర్ణి నిలిచిపోయింది.

Gautamiputra Satakarni overseas collections

అల్రెడీ చిరు రెండో రోజుకే 50 కోట్ల మార్క్ అందుకోగా, బాలయ్య కూడా అలవోకగా ఆ ఫీట్ సాధించేశాడు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి పునరాగమనం చేసిన చిరు నేరుగా 2 మిలియన్ క్లబ్బును టచ్ చేసి భీభత్సం సృష్టించగా, బాలయ్య కూడా తన శతకంతో మిలియన్ మార్క్ ని అందుకుని సత్తా చాటాడు. ఇక వీటితోపాటే రిలీజ్ అయిన శతమానం భవతి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా బాగానే కలెక్షన్లు రాబడుతుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles