విడాకులకు మలైకా కండిషన్? గోవాలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు | Malaika conditions for divorce.

Malaika arbaaz spotted in goa

Malaika Arora Khan, Arbaaz Khan, Malaika Arbaaz Khan, Arbaaz Khan divorce, Malaika Arora divorce, Malaika 10 crores, Malaika Arora Arbaaz Khan, Arbaaz Khan Malaika Arora Goa Malaika Goa enjoyment

Malaika Arora Khan and Arbaaz Khan party together in Goa. Rumour surrounding She demands 10 crores for divorce.

విడాకుల జంట ఆ పార్టీలో జంటగా...

Posted: 12/31/2016 12:17 PM IST
Malaika arbaaz spotted in goa

బాలీవుడ్ లో టాప్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడి విడాకుల వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది తెలిసిందే. 18 ఏళ్ల బంధాన్ని కాలరాజేసుకుని వ్యక్తిగత కారణాలతో ఆర్బాజ్, మలైకాలు విడిపోవాలని డిసైడ్ అయ్యారు. సల్మాన్ తో సహా ఇరు కుటుంబాలు ఆ జంటను కలపాలని చూసినా వీలు పడకపోవటంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయింటం మనం చూశాం. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఈ ఇద్దరూ ఇప్పుడు కలిసి పార్టీల్లో తెగ చక్కర్లు కొడుతున్నారు.

అవునండీ.. నిజమే. అయితే అది పెయిర్ గా కాదు.. ఫ్యామిలీతో సహా.. గోవాలో జరిగిన న్యూఇయర్ వేడుకల ట్రిప్ కోసం రెండు కుటుంబాలు హాజరుకాగా, అక్కడ జరిగిన డిన్నర్ కి సంబంధించి ఓ ఫోటోను మలైకా సిస్టర్ అమృత తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే అందులో వాళ్లేం పక్కపక్కన లేరులేండి. మలైక ఓ గ్లాస్ తో దర్శనం ఇవ్వగా, ఆర్బాజ్ కాస్త దూరంలోనే ఉన్నాడు.

Arbaaz Khan Malaika Goa

ఇక ఆ మధ్య కొడుకు అర్హాన్ బర్త్ డే సందర్భంగా ఇద్దరూ జంటగా హాజరయి ఫ్యామిలీని సంతోషపరిచారు. కాగా, ప్రస్తుతం కనిపిస్తున్న ఫోటోలో మలైక, ఆర్బాజ్ తోపాటు మలైక కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇక విడాకుల కోసం మలైకా 10 కోట్లు డిమాండ్ చేసిందన్న పుకార్లు బాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malaika Arora  Arbaaz Khan  Goa party  

Other Articles