రోబోలో చిరు సర్ ప్రైజ్ గురించి... | robo 2.0 team on chiru's guest role.

No chiru in enthiran sequel

Chiru and Rajinikantha, Chiranjeevi in Robo-2, Robo-2 Chiranjeevi, Shankar Chiranjeevi, Chiru Rajini, Megastar Superstar, Chiranjeevi Robo sequel, Chiranjeevi special appearance

Megastar Chiranjeevi no in Rajainikanth's Robo sequel.

రోబో-2 లో చిరు క్లారిటీ ఇచ్చేశారు

Posted: 12/13/2016 09:57 AM IST
No chiru in enthiran sequel

ప్రస్తుతం రోబో సీక్వెల్ లో రజనీ బిజీగా ఉన్నాడు. ఏషియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా సెన్సేషన్ గా మారింది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా, ఆస్కార్ కాంబో రెహ్మాన్-రసుల్ తదితర టెక్నిషన్స్ పని చేస్తుండటం, పైగా శంకర్ సినిమా కావటంతో భారీ అంచనాలే ఉన్నాయి. రోబో తర్వాత హిట్ లేకుండా పోయిన రజనీ దీనిపైనే ఆశలు పెట్టుకున్నాడు కూడా.

ఇంతలో సినిమాకు ఎక్స్ ట్రా కలరింగ్ ఇస్తూ మెగాస్టార్ చిరంజీవితో ఓ రోల్ చేయించబోతున్నారన్న వార్త రేగింది. రజనీకాంత్‌, చిరంజీవి కలసి గతంలో 'రానువ వీరన్‌', మాపిల్లై( తెలుగులో అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు)లో నటించారు. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్‌ చూడబోతున్నారంటూ వార్తలు వచ్చేశాయి.

ఇంతకు ముందు ఇదే రోల్ లో మహేష్ బాబు, ఎన్టీఆర్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు అదే రీతిలో చిరంజీవి అతిథి పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై లైకా సంస్థ అదంతా ఉత్తదేనని పేర్కొంది. సినిమాకు సంబంధించి సర్ ప్రైజ్ లు ఏం ఉండబోవని, ఒకవేళా ఉన్నా ముందే చెప్పేస్తామని పేర్కొంది. ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ పనుల్లో శంకర్‌ ఉన్నట్లు తెలిసింది. 'ఎంతిరన్‌(రోబో)'లో వేల రోబోలు వచ్చినట్టుగా ఇందులో రోబోలతో పాటు, అదనంగా రాకాసి పక్షులు కూడా సందడి  చేయనున్నాయంట. వచ్చే ఏడాది దీపావళి కానుకగా చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi Guest Role  Rajinikanth  Robo 2  

Other Articles