మహేష్ సినిమా తెలుగువాళ్లను తీసుకోరా? | Kollywood actor bags Mahesh's movie.

Premisthe bharat in mahesh murugadoss movie

Mahesh - Murugadoss, Mahesh Babu new movie, Mahesh Murugadoss, Murugadoss Mahesh Babu movie, Mahesh Murugadoss movie, Murugadoss Movie Bharat, bharat in mahesh movie, Premisthe Bharat in Mahesh Movie, Kollywood actors in Mahesh Movie

Mahesh - Murugadoss film gets another actor on board. Premisthe fame bharat key role in this movie.

మహేష్ సినిమా కోసం మరో తమిళ నటుడు

Posted: 12/13/2016 10:32 AM IST
Premisthe bharat in mahesh murugadoss movie

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు-మురుగదాస్ అన్ టైటిల్డ్ ప్రాజెక్ట్ షూటింగ్ చకచకా సాగిపోతుంది. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో ఈ బైలింగువల్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అహ్మదాబాద్ లో జరుగుతోంది. మహేశ్ బాబు తదితరులతో ఛేజింగ్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో విలన్ గా ఎస్. జె. సూర్య నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోలీవుడ్ టచ్ ఉన్న నటులనే తీసుకుంటున్నాడని మహేష్ అభిమానులు పెదవి విరుస్తున్నప్పటికీ, ఇప్పుడు మరో నటుడిని కూడా ఎంపిక చేశాడని సమాచారం. బాయ్స్ సినిమా ద్వారా అందరికీ సుపరిచితుడైన భరత్ ఓ కీ రోల్ చేయబోతున్నాడంట. గతంలో యువ లాంటి తెలుగు చిత్రంతోపాటు, 'ప్రేమిస్తే' ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అందుకే అతనితో రోల్ చేయిస్తే సమస్య ఉండదని భావిస్తున్నాడంట.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న మూవీకి 'సంభవామి' అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి ఫస్ట్ 1న సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ కానున్నాయి. హ్యాట్రిక్ హిట్ల బ్యూటీ రకుల్ ఇందులో మహేష్ కి జోడీగా కనిపించబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  Murugadoss movie  Premisthe Bharat Mahesh Babu  

Other Articles