జయకు సినీ సెలబ్రిటీల నివాళులు | Film stars pays tribute to Jayalalitha.

Amithabh and rajani pays tribute to jayalalitha

Jayalalitha Demise, Film Stars tribute to Jayalalitha, Movie celebrities tribute to Jayalalitha, Big B Rajani Jayalalitha, Kollywood mourns to Jayalalitha, SRK Rajani amithabh Jayalalitha, Celebrities tweet Jayalalitha

Indian Film Celebrities express condolence to Jayalalitha's Demise.

జయకు అమితాబ్, రజనీ నివాళులు

Posted: 12/06/2016 11:33 AM IST
Amithabh and rajani pays tribute to jayalalitha

సినిమాల్లోనే కాదు.. రాజకీయాలతో కూడా చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను పదిలపరుచుకున్న వ్యక్తి జయలలిత. తీవ్ర అనారోగ్యంతో ఆమె చనిపోవటంతో దేశం మొత్తం విషాదంలో ముంచేసింది. కథానాయకిగా సినీరంగంలో వెలుగు వెలిగిన ఆమె అంతే వేగంతో రాజకీయాల్లో దూసుకుపోయి అమ్మగా మారిపోయింది. ఆమె మృతితో కోలీవుడ్ తోపాటు యావత్ దేశంలోని నటులంతా దిగ్భ్రాంతి వ్యక్తిం చేస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్, అమితాబ్ బచ్చన్ ఇలా అంతా తమ సంతాపం తెలిపారు.

తమిళనాడు ఒక సాహసోపేతమైన మహిళా నాయకురాల్ని కోల్పోయిందని, ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. ఆమె ఒక ఫైటర్ , అందరికీ స్పూర్తి ప్రదాత అంటూ ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు. ఆమె మరణం తమిళ ప్రజలకు తీరని లోటు..కానీ వారి గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని, ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వీరందరితో పాటు పార్తీపన్, మాధవన్, నకుల్ , జయం రవి తదితర పలువురు సినీ ప్రముఖులు జయలలిత ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్స్ చేసాడు.

 

వందేళ్ల భారతీయ సినీ వేడుకలో అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఏకైక ముఖ్యమంత్రి జయలలిత. ఆమె నటి కావటం మా అదృష్టం అని అమితాబ్ ట్వీటాడు.

జయలలితగారి మరణం తమిళులకే కాదు.. మా అందరికీ కూడా దిగ్భ్రాంతి కలిగించిందని బాద్ షా షారూఖ్ పేర్కొన్నాడు.

ఇక కోలీవుడ్ నటీమణులంతా అమ్మకి తమ శైలిలో నివాళులర్పించారు. స్వర్గంలో ఆమెకోసం మరోసింహాసనం ఎదురుచూస్తోందని హీరోయిన్ త్రిష ట్వీట్ చేశారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జయలలిత అంటూ ఆమె సంతాపం ప్రకటించారు. ఆమెను కలవడం అదృష్టమనీ, చాలా గర్వంగా ఉందంటూ జయలలిత కలిసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు. అతి ధైర్యవంతమైన మహిళల్లో జయలలిత ఒకరని శృతి హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు అత్యంత సాహసోపేతమైన మహిళా నాయకురాలని కోల్పోయిందని, ఆమె మృతి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు.

ఆమె ఒక ఫైటర్ , అందరికీ స్పూర్తి ప్రదాత అంటూ ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జయలలిత మరణం తమిళ ప్రజలకు తీరని లోటు..కానీ వారి గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోతారని, ఆత్మకు శాంతి కలగాలని రాధిక ప్రార్థించారు.

స్టార్ డైరక్టర్ గౌతం వాసు దేవ్ మీనన్, పార్తీపన్, మాధవన్, నకుల్ , జయం రవి, పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా జయలలిత ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్స్ చేసారు. మరోపక్క ప్రణబ్, మోదీ, రాహుల్ తో పాటు పలువురు రాజకీయ నేతలు ఆమెకు నివాళులర్పించినవారిలో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalitha Death  Movie Stars  Condolence  Twitter  

Other Articles