అదసలు పాటా? ఎందుకంత హిట్ అయ్యిందంటూ ఫైర్ | SRK Cannot Believe PPAP Is A Song

Shah rukh khan loses his cool after watching ppap song

Shah Rukh Khan, 'Pen-Pineapple-Apple-Pen' song, PPAP SRK, SRK PPAP Song, PPAP really a Song

Shah Rukh Khan Cannot Believe PPAP Is A Song and loses his cool after watching that song

పాపులర్ పాటపై చిరాకుపడ్డ బాద్ షా

Posted: 11/24/2016 12:17 PM IST
Shah rukh khan loses his cool after watching ppap song

నలుగురి దారి ఒకటయితే, తన దారి ఒకటని బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మళ్లీ నిరూపించుకున్నాడు. ప్రపంచం అంతా ఓ పాటతో ఊగిపోతుంటే, అది షారూఖ్ కి ఏ మాత్రం నచ్చలేదంట. అదసలేం ఏం పాట అంటూ ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగానే సెటైర్లు వేసేశాడు.

డియర్ జిందగీ చిత్ర ప్రమోషన్ కోసం షారూఖ్, అలియాలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ కొన్నిరాపిడ్ ఫైర్ ప్రశ్నలు సంధించింది. ఈ క్రమంలో పీపీఏపీ (పెన్-పైనాఫిల్-ఆపిల్-పెన్) అనే ఓ పాట గురించి ప్రస్తావన వచ్చింది. ఇంతకీ ఆ పాట ఏంటంటే... జపాన్ కు చెందిన కోసాకా డైమ్యూవో అనే డీజే ఒకరు ఈ పాటను రూపొందించాడు. పీకో-టారో అనే కల్పిత పాత్ర ధరించిన కోసాకా గోల్డ్ కలర్ దుస్తులు, చిన్న మీసాలు ధరించి.. ఐ యావ్ పెన్, పైనాఫిల్, యాపిల్, పెన్... అంటూ స్టెప్పులేస్తుంటాడు.

అక్టోబర్ 7 న వరల్ట్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ ఆల్బమ్ యూట్యూబ్ లో సంచలనంగా మారింది. ట్యూన్ లో పదాలు క్యాచీగా ఉండటంతో రెండు కోట్ల మందికి పైగానే వీక్షించారు కూడా. దీంతో దీనికి సంబంధించిన ప్రశ్నను సంధించారన్న మాట. ఆపై షారూఖ్ తెలీదని సమాధానం ఇచ్చేసరికి ఆ వీడియోను చూపించారు అంతే...

అదసలు పాటా? ఇలాంటి పాటలు చూపించి నా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? అతనసలు ఏం చేస్తున్నాడు? నేను రోజు బాత్ రూంలో ఇలాంటి పాటలే పాడుతుంటాను. ఈ సోషల్ మీడియాలో జనాలకు ఏమైంది? ఎందుకు ఆ పాటను అంతగా పాపులర్ చేస్తున్నారు? అంటూ కాస్త అసహనం ప్రదర్శించాడు. పక్కనే ఉన్న అలియా కూడా షారూఖ్ తో తందాన అంటూ ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇదంతా చూసిన వాళ్లు బాద్ షా బుద్ధి ఇక మారబోదంటూ పెదవి విరుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharukh Khan  Can't Believe  PPAP Song  

Other Articles