మరదలు కోసం ఫస్ట్ టైం ధనుష్ | Dhanush romance with three heroines first time.

Three heroines romance with dhanush

Hero Dhanush, Dhanush Three Heroines, Dhanush VIP-2, VIP-2 Director, VIP sequel, eroine in VIP-2

Dhanush romance with Amala Paul, Kajal and Manjima in VIP-2 sequel.

మరదలి కోసం స్టార్ హీరో రేర్ ఫీట్

Posted: 11/24/2016 11:42 AM IST
Three heroines romance with dhanush

ప్రస్తుతం యువహీరోల జోరు మాములుగా లేదు. ఇంతకు ముందు హీరోలంటే ఏడాదికో, ఏడాదిన్నరకో ఓ సినిమా అన్న చందాన ఉండేవాళ్లు. అయితే విజయ్ సేతుపతి, నాని లాంటి దక్షిణాది హీరోల పుణ్యామాని సంవత్సరానికి మూడు, నాలుగు చిత్రాలతో సందడిగా ఉంటోంది.

కోలీవుడ్ స్టార్ హీరో, రజనీ అల్లుడు ధనుష్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ యేడాది అల్రెడీ రెండు చిత్రాలతో వచ్చేశాడు. రైల్ చిత్రం అట్టర్ ఫ్లాప్ కాగా, రీసెంట్ గా వచ్చిన ధర్మయోగి దుమ్మురేపేసింది. ఇక ఇప్పడు అల్రెడీ సెట్స్ మీద మరో రెండు చిత్రాలు ఉన్నాయి. ఇంతలో బైలింగువల్ అంటూ వీఐపీ-2 సీక్వెల్ ను అనౌన్స్ చేసేశాడు కూడా. ప్రస్తుతం గౌతమ్ మీనన్ సినిమాతోపాటు, వెట్రిమారన్ దర్శకత్వంలోనూ ఓ మూవీలో యాక్ట్ చేస్తున్న ధనుష్, మరదలు సౌందర్య దర్శకత్వంలోనే వీఐపీ 2 చేయనున్నాడు.

ఇందుకోసం ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది. అమలాపాల్ తోపాటు, కాజల్, మాంజిమా మోహన్ లు కూడా  సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ రకంగా ఫస్ట్ టైం తన కెరీర్ లో ధనుష్ ముగ్గురు హీరోయిన్లతో జోడీ కట్టబోతున్నాడు. అయితే ఇది వీఐపీ-2 కోసమా? లేక గౌతమ్ మీనన్, వెట్రిమారన్ సినిమా కోసమా అన్నది మాత్రం స్పష్టత లేకుండా పోయింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Three Heroines  VIP sequel  

Other Articles