బాలీవుడ్ పై మెగాస్టార్ భార్య సీరియస్ | Amithabh wife Jaya Bachchan fire on Bollywood film makers.

Jaya bachchan fire on bollywood film makers

Jaya Bachchan fire on Bollywood Makers, Amithabh wife Jaya Bachchan fire Movies, Bollywood become business, Megastar wife fire on Bollywood

Senior Actress Jaya Bachchan fire on Bollywood film makers, nowadays Filmmaking has become a business.

మెగాస్టార్ భార్య సంచలన వ్యాఖ్యలు

Posted: 10/26/2016 01:41 PM IST
Jaya bachchan fire on bollywood film makers

బాలీవుడ్ సీనియర్ నటి, బిగ్ బీ అమితాబ్ భార్య జయా బచ్చన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీ ఓ వ్యాపారంగా మారిపోయాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్ (మామి) 18వ సినీ ఉత్సవంలో భాగంగా సినీ దర్శకుడు బిమల్ రాయ్ సంస్మరణార్థం మంగళవారం రాత్రి ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన జయ బచ్చన్ మాట్లాడుతూ, చిత్ర నిర్మాతలపై మండిపడ్డారు.

‘‘ఒకప్పుడు ఫిలిం మేకర్లు కళాఖండాలను రూపొందించేవారు... కానీ, ఇప్పటి వారికి అది పట్టడం లేదు. ఎంతసేపు నంబర్లు, బిజినెస్ మాత్రమే చూసుకుంటున్నారు’’ అని జయ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా అంటే ఇప్పుడు పచ్చి బిజినెస్ గా మారిందని, సినిమావాళ్లు బరితెగించారని ఆమె విమర్శించారు. ఇప్పడంతా లెక్కలతోనే కాలం వెల్లదీస్తున్నారు. తొలి వారం రికార్డులు, రూ. 100 కోట్ల కలెక్షన్లు... ఇప్పుడంతా వీటినే చూస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నీ తనకు అర్థం కావని, అందుకే ఇలాంటి చోట తాను ఇమడలేక పోతున్నానని చెప్పారు.

తెరనిండా పాశ్చాత్య పోకడలు కనిపిస్తున్నాయని, పొట్టి పొట్టి దుస్తులే తప్ప భారతీయత ఎక్కడుందని ప్రశ్నించారు. 50, 60 దశకాల్లో సినిమాల్లో జీవం ఉట్టి పడేదని చెప్పారు. ఆ రోజుల్లో సినిమాల్లో ఒక హీరోయిన్, ఒక వాంప్ ఉండేవారని... ఇప్పుడు వాంప్ ల అవసరం లేదని, హీరోయిన్లే వాంప్ లు చేయాల్సినవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. (గతంలో షారూఖ్ హ్యాపీ న్యూఇయర్ ను ఉద్దేశించి కూడా చెత్త సినిమా అంటూ ఆమె వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే)

అలీగఢ్, మసాన్ లాంటి సినిమాలు నిజమైన భారతీయ సినిమాలని... అలాంటి సినిమాలను భారతీయులు ఎప్పటికప్పుడు ఆదరిస్తుంటారని తెలిపారు. జనజీవితాలను ప్రతిబింబించే ఏ సినిమా అయినా అద్భుతంగా ఉంటుందని ఆమె అన్నారు. అయితే అసలు ఇప్పుడు ఆమె ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారంటే... మరాఠీ సినిమా ‘కోర్ట్’ అస్కార్ కు అఫీషియల్ గా పంపబడింది. ఈ సినిమాను మామీలో ప్రదర్శిస్తే వీక్షకులు ఏ మాత్రం లేరంట. అందుకే ఆమె హర్టయ్యి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి సినిమాలపై ప్రేక్షకులు కూడా ఆదరణ చూపించాల్సిన అవసరం ఉంటుందని యంగ్ స్క్రీన్ ప్లే రైటర్, ఎడిటర్ అపూర్వ అసరానీ చెబుతున్నారు. ఏదేమైనా బడా ప్రొడ్యూసర్లను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaya Bachchan  Bollywood Film Makers  Business  

Other Articles