వర్మ ట్వీట్ పై కత్రినా ఫుల్ హ్యాపీ | Katrina Happy with varma tweet on Smitha Patil Award

Katrina happy with varma tweet on smitha patil award

Katrina Kaif on Smitha Patil Award criticism, Katrina thanks to Varma, Katrina Kaif RGV, Katrina on RGV tweet, Smitha Patil Award Controversary, Katriana Kaif about Ram Gopal Varma tweet

Katrina Kaif Happy with varma tweet on Smitha Patil Award Controversary.

వర్మ ట్వీట్ గురించి కత్రినా కామెంట్

Posted: 09/28/2016 06:07 PM IST
Katrina happy with varma tweet on smitha patil award

బాలీవుడ్ బార్బీ డాల్ కత్రినా కైఫ్ కి ప్రతిష్టాత్మక స్మితా పాటిల్ అవార్డు అందజేయటంపై వారం రోజులుగా సోషల్ మీడియాలో చెలరేగుతున్న దుమారం తెలిసిందే. ముఖ్యంగా కత్రినాకు ఏం తక్కువ అంటూ రాంగోపాల్ వర్మ చేసిన సపోర్ట్ ట్వీట్ తో వ్యవహారం మరింత ముదిరింది.  ఎక్స్ ప్రెషన్స్ కూడా ఇవ్వటం రాని కత్రినాకు ఈ అవార్డు ఇవ్వటం ఏంటో అంటూ నెటిజన్లు ఛలోక్తులు పేల్చగా... నటనకు సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చి ఇంత గొప్ప అవార్డు అందుకోవటం గొప్పే కదా అన్నది వర్మ వర్షన్.

అయితే అవార్డు తనకు రావడంపై పలువురు పలురకాల అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, ఈ అవార్డు ఇచ్చే వారికే తన గురించి పూర్తిగా తెలుసు కనుకే ఇచ్చారని బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'స్మితాపాటిల్ అవార్డు తనకు ప్రకటించగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ నాకు మద్దతుగా నిలుస్తూ చేసిన ట్వీట్ ను నేను ఎన్నటికీ మరవలేను' అని చెప్పింది.

వర్మ ట్వీట్ లో తన గురించి చెప్పిన ప్రతి విషయం వాస్తవమేనని, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనకు డ్యాన్స్, నటన గురించి ఏమీ తెలియదని చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అవి నేర్చుకోవడమంటే గొప్పే కదా? అని కత్రినా తెలిపింది. అన్నట్లు దీపికా పదుకునేకి ఈ అవార్డు ప్రకటించినప్పుడు కూడా ఇదే రీతిలో విమర్శలు వినిపించాయి కూడా. కత్రినా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తక్కువకాలంలోనే సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు దేశంలో అందమైన సెలబ్రిటీల్లో ఒకరని అందుకే ఈ పురస్కారంతో ఆమెని సత్కరించాము అంటూ ప్రియదర్శిని అకాడమీ ఓ ప్రకటనలో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karina Kaif  RGV  Tweet  Smitha Patil Award  controversary  

Other Articles