ఎన్టీఆర్ లేకుండా మహాభారతమా.. ఛాన్సే లేదు? | NTR must in Rajamouli's Mahabharata

Ntr must in rajamouli s mahabharata

Rajamouli Reveals NTR in Mahabharata, Rajamouli again about Mahabharata, NTR in Rajamouli's Dream Project, Junior NTR in Mahabharata, Tarak in Mahabharata, NTR Rajamouli Mahabharata, Rajamouli Confirmed Mahabarata with NTR, Rajamouli next after Baahubali 2 confirmed

Rajamouli Reveals Junior NTR lead role in his Dream Project Mahabharata.

మహాభారతం కోసం జక్కన్న మనుసులో ఎవరు?

Posted: 09/29/2016 10:29 AM IST
Ntr must in rajamouli s mahabharata

తన కలల ప్రాజెక్టు మహాభారతం అని ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్న దర్శకధీరుడు రాజమౌళి, దానిని ఎప్పటి నుంచి తెరకెక్కించే విషయం మాత్రం ఇంతదాకా స్పష్టంగా చెప్పలేకపోయాడు. బాహుబలి ఫీవర్ మొదలైన సమయం నుంచి అనేక ఇంటర్వ్యూలో ఈ ఎపిక్ ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ, దానిని కార్యరూపంలో పెట్టాలంటే ఏళ్లకు ఏళ్లు పడుతుందని, అంత ధైర్యం చేసే నిర్మాతలు, నటులు దొరకటం కష్టమని చెప్పుకొచ్చాడు. ఇంకోవైపు పౌరాణిక పాత్రల్లో పరాకాయ ప్రవేశం చేసే నటులు ఎవరుంటారా అన్న డిస్కషన్ కూడా మొదలైంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహాభారతం రాజమౌళికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది. మెయిన్ రోల్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటాడని చెప్పిన రాజమౌళి, బాహుబలి2 తర్వాత సెట్స్ మీదకు వెళ్తామని సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఎన్టీఆర్ లేని మహాభారతం ఉండదని, మహాభారత కథతో తాను త్వరలో తెరకెక్కించబోయే సినిమాలో తారకే హీరో అని రాజన్న చెప్పాడంట. నిజానికి బాహుబలి కంటే మందుగానే ఈ సినిమాను తీయాలని భావించినప్పటికీ, ఆఖరి చిత్రంగా మహాభారతాన్ని తీసి రిటైర్ మెంట్ అవ్వాలని రాజమౌళి ఫ్లాన్.  

భారీ చిత్రాలను నిర్మించడంలో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్న రాజమౌళి మహాభారతం కోసం ఐదు నుంచి ఏడేళ్లకు పైగా సమయం పటొచ్చని భావిస్తున్నాడు. కానీ, అంతకాలం డేట్లు ఇచ్చే ధైర్యం ఏ హీరో చేయడు గనుక ముందు బాహుబలి పని పట్టేశాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో, ఈ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే వివిధ పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో జక్కన్న, లీడ్ రోల్ మాత్రం క్లోజ్ ఫ్రెండ్ ఎన్టీఆరే అని డిసైడ్ అయ్యాడంట. ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి గ్రాండ్ వీడ్కోలు చెప్పటంతోపాటు, చరిత్ర సృష్టించాలని దర్శకధీరుడి ఫ్లాన్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajamouli  Dream Project  NTR  Mahabharata  

Other Articles