ఎన్టీఆర్ ఇజం గెస్ట్ రోల్ నిజమేనంట | NTR helps to Kalyan Ram ISM movie

Ntr helps to kalyan ram ism movie

NTR helps to Kalyan Ram ISM movie, NTR reject guest role in ISM, NTR Guest Role in ISM true, ISM voice over, NTR voice over to brother, NTR helps to ISM business

NTR helps to Kalyan Ram ISM movie. Reject Guest Role but accept to give voice over.

అన్నకి ఎన్టీఆర్ సాయం అలాగన్న మాట!

Posted: 09/24/2016 05:20 PM IST
Ntr helps to kalyan ram ism movie

నందమూరి అన్నదమ్ముల బలం బలపడటానికి కారణం విషాదమే అయినా ఇప్పుడు వారిద్దరు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఆడియో పంక్షన్ల దగ్గరి నుంచి సక్సెస్ మీట్ల దాకా ఒకరి గురించి ఒకరు లేపి లేపి వదులుకోవటం లాంటివి చాలానే చేస్తున్నారు. ముఖ్యంగా అన్న కళ్యాణ్ రామ్ కి కథల ఎంపిక విషయంలో ఎన్టీఆర్ చాలానే సలహాలు ఇస్తుంటాడని చెప్పుకుంటుంటారు. ఇక ఇప్పుడు ఇజం సినిమా కోసం తారక్ పెద్ద సాయానికే సిద్ధపడినట్లు తెలుస్తోంది.

పూరి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ 'ఇజం' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా, కొన్ని సీన్లు బాగా రాలేదన్న ఉద్దేశంతో రీషూట్ చేయిస్తున్నాడు పూరి. ఇక కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమాకి బిజినెస్ పరంగా హెల్ప్ చేస్తున్నాడంట ఎన్టీఆర్. కొన్ని ఏరియాల్లో తన పలుకుబడి ఉపయోగించి మంచి రేటుకు ఇజం మార్కెట్ ను క్లోజ్ చేయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ముందుగా సినిమాలో ఎన్టీఆర్ తో గెస్ట్ రోల్ చేయించాలని ప్రయత్నించిన మాట కూడా వాస్తవమేనని సమాచారం.

కానీ, తాను పూర్తిస్థాయిలో నటిస్తాననీ .. అందువలన గెస్టు రోల్ చేయనని ఎన్టీఆర్ సున్నితంగా చెప్పాడట. దాంతో ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా వుంటుందనే వుద్దేశంతో, వాయిస్ ఓవర్ అయినా చెప్పమని అడిగారట. అందుకు ఎన్టీఆర్ అంగీకరించాడని అంటున్నారు. త్వరలోనే ఆయన వాయిస్ ఓవర్ ను రికార్డ్ చేస్తారని చెబుతున్నారు. జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్న ఇజం అక్టోబర్ 7వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  ISM  Voice Over  Kalyan Ram  

Other Articles