హైదరాబాద్ కోసం రంగంలోకి దిగిన ‘మా’ | MAA participate in hyderabad flood releif program

Maa participate in hyderabad flood releif program

MAA Association participate in Hyderabad flood relief, Hyderabad flood relief, Maa Association in Hyderabad Rains, MAA in Hyderabad Rain Effected Areas

Maa participate in hyderabad flood relief program.

నగరం కోసం మా రంగంలోకి దిగింది

Posted: 09/24/2016 04:43 PM IST
Maa participate in hyderabad flood releif program

తెలుగు ప్రజలు ఆపదలో ఉన్నారంటే చాలూ ముందు వరసలో ఉండి సాయం చేసే టాలీవుడ్ మరోసారి కదిలింది. భారీ వర్షాలతో అతలాకుతలం అయిపోతున్న భాగ్యనగరంను ఆదుకునేందుకు మా అసోషియేష్(మూవీ ఆర్టిస్ట్ అసోషియేన్) కదిలింది. ఈ మేరకు శనివారం మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, సభ్యుడు శివాజీ రాజా, ఏడిద శ్రీరాంతోపాటు, మిగతా సభ్యులు.. నటి మంచులక్ష్మీ, హీరో మంచు మనోజ్, నవదీప్, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గౌతంరాజు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆల్విన్ కాలనీ, ధరణి నగర్ లో బాధితులకు ధైర్యం చెప్పి ఆహార పోట్లాలను, మినరల్ వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... తన తోటి సోదరులకు సాయంగా ఉంటామని ప్రకటించాడు. ఇక నటుడు రానా అందరికన్నా ముందుగానే స్పందించడం విశేషం. 'ప్రకృతి మనల్ని మరోసారి పరీక్షిస్తోంది. సాయం చేసేందుకు మంచి వ్యక్తులందరూ కలిసి రండి. వాలంటీర్లుగా సాయం చేస్తే ఇంకా మేలు. మీ సహాయాన్ని పోస్ట్ చేసి అభినందిస్తాం అంటూ ట్వీట్ చేశాడు.

హైద్రాబాద్ లో వరద ఉధృతి ఎదుర్కొంటున్న ప్రాంతాలపై సమాచారం అందించండి. రిలీఫ్ మెటీరియల్ అందించండలో సాయం చేయండి. ఎవరికైనా సాయం కావాలంటే పోస్ట్ చేయండి. వీలైనంత త్వరగా మిమ్మల్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తాం' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రానా. ఇక పలువురు నటీనటులు ఇప్పటికే తమ వంతు సాయంగా రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం.

 

కాగా, ప్రకృతి విపత్తుల సమయంలో సాయం అందించడం టాలీవుడ్ కు కొత్తేమీ కాదు. రెండేళ్ల క్రితం చెన్నై వరదల సమయంలో కూడా టాలీవుడ్ నుంచి రానా అండ్ టీం ముందున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MAA  Particiapte  Hyderabad  Floods  

Other Articles