ధ్రువ కోసం చాలా రిస్క్ జరుగుతోంది | Negative Buzz to Dhruva but Business peaks

Negative buzz to dhruva but business peaks

Ram Charan Dhruva Low Buzz, Negative Factors to Dhruva, Ram Charan Dhruva Business, Ram Charan Dhruva, Dhruva Movie, Negative Buzz to Dhruva, Charan Risk for Dhruva, Dhruva cross Janatha Garage

Ram Charan Dhruva Low Buzz but doing business well.

నెగటివ్ టాక్ ధ్రువకి ఎందుకు క్రేజ్

Posted: 09/23/2016 10:45 AM IST
Negative buzz to dhruva but business peaks

స్టార్ హీరో, చేసేది రీమేక్, పైగా ఇప్పటికే చాలా డిలే అయ్యింది. ఇన్ని ప్రతికూల అంశాలున్న ధ్రువ చేసిన బిజినెస్ చూస్తే మాత్రం ఎవరికైనా కళ్లు బయ్యర్లు కమ్మాల్సిందే. కొన్ని ఏరియాల్లో ఇప్పటిదాకా హయ్యెస్ట్ బిజినెస్ జరిగిన సినిమాలకు ధీటుగా అమ్ముడుపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇక ఒవర్సీస్ లో చరణ్ ఫ్లాప్ అవుతూ వస్తున్నప్పటికీ ధ్రువ కోసం మాత్రం ఏకంగా 8.5 కోట్లు పెట్టడం అంటే మాములు విషయం కాదు.  

మెగాపవర్ స్టార్ ఇమేజ్, గీతా ఆర్ట్స్ బ్యానర్, పైగా కథా బలమైంది కావటంతోనే బయ్యర్లు ఈ రిస్క్ చేస్తునట్లు అర్థమౌతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో చెర్రీ .. రకుల్ .. అరవింద్ స్వామి తదితరులు పాల్గొనగా కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఇంటర్వెల్ కి ముందుగా వచ్చే ఈ సన్నివేశాలు తమిళ్ లో హైలెట్ గా నిలిచాయి. దీంతో తెలుగులోనూ ఆకట్టుకుంటాయని విశ్వసిస్తోంది చిత్ర యూనిట్.

మరోవైపు ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసమే చరణ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడనీ సమాచారం. గతంలో బ్రూస్ లీ కోసం థాయ్ వెళ్లిన చెర్రీ, ఇప్పుడు మాత్రం దేశీ వాళీ ట్రైనర్ లతోనే ఫిట్ నెస్ పెంచుకున్నాడంట. కాగా, రాంచరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే. డిసెంబర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva  Negative Factors  Business  Well  

Other Articles