ఆస్కార్ ఎంట్రీగా ధనుష్ సినిమా | India's official entry to Oscars is Tamil film Visaranai

India s official entry to oscars is tamil film visaranai

Dhanush movie in Oscar Race, Visaranai In Oscar Race, Vetrimaran Visaranai in Oscar Race, Visaranai Foreign Language Film category, India's official entry to 89th Oscars, 89th Oscars is Tamil film Visaranai

India's official entry to 89th Oscars is Tamil film Visaranai. Directed by Vetrimaran and produced by Dhanush, is India's official entry for Academy Awards 2017 in the Foreign Language Film category.

ఆస్కార్ బరిలో ధనుష్ సినిమా

Posted: 09/22/2016 05:37 PM IST
India s official entry to oscars is tamil film visaranai

రియాలిటీకి దగ్గరగా ఉండే కథనాలతో తెరకెక్కించే చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. కలెక్షన్ల సంగతి పక్కనపెడితే క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కుతుంటాయి. ఈ కోవలో కోలీవుడ్ లో తెరకెక్కిన విసరణై చిత్రం కూడా ఒకటి. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎం.చంద్రకుమార్ రాసిన 'లాకప్' అనే నవల ఆధారంగా తీశారు. నటుడు ధనుష్ వండర్ బార్ పేరిట ఈ సినిమాను తెరకెక్కించాడు.

జాతీయ అవార్డు పొందిన ఈ చిత్రంలో తమిళనాడు నుంచి ఆంధ్రాకు వచ్చిన నలుగురు యువకుల జీవితం ఓ పోలీసాఫీసర్ మూలంగా ఎంత కకావికలం అయ్యాయో కళ్లకు కట్టినట్లు చూపించారు. విసరణై లో దర్శకుడు సముద్రఖనితోపాటు, తెలుగు నటుడు అజయ్ ఘోష్, మరో తెలుగమ్మాయి ఆనంది(బస్ స్టాప్ ఫేం రక్షిత) కూడా నటించారు. చిత్ర సగంకి పైగా షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లోనే షూట్ చేశారు.

జాతీయ అవార్డును గెలుచుకున్న విసరణై ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. భారతదేశం నుంచి ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో ఈ సినిమా అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది.  మొత్తం 29 చిత్రాలు పోటీ పడగా, చివరకు విసరణై బరిలో నిలిచింది. ఈ విషయాన్ని ఎఫ్ఎఫ్ఐ చైర్మన్ కేతన్ మెహతా ధ్రువీకరించారు.

థియేటర్లలో విడుదల కాకాముందే 72వ వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా మంచి స్పందన లభించింది. కాగా, 89 వ ఆస్కార్ అవార్డు వేడుకలు 2017 ఫిబ్రవరిలో లాస్ ఏంజెలెస్లో జరుగనున్నాయి. త్వరలో ఈ చిత్ర తెలుగు వర్షన్ విడుదలకానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Visaranai  Oscar Race  Foreign Language Film category  

Other Articles