అసభ్యప్రవర్తన కేసులో మళయాళ నటుడి అరెస్ట్ | Kerala Actor Sreejith Ravi arrested for allegedly flashes minor girls

Kerala actor sreejith ravi arrested for allegedly flashes minor girls

Kerala Actor Sreejith Ravi, Kerala Actor Sreejith Ravi arrested, Sreejith Ravi arrested, Sreejith Ravi misbehave, kerala actor misbehave, mallu actor misbehave, Mallu real villian, Sreejith Ravi allegedly flashes, actor misbehave with minor girls

Actor Sreejith Ravi arrested for allegedly flashes minor girls, arrested.

మైనర్ బాలికలతో విలన్ అసభ్యప్రవర్తన

Posted: 09/02/2016 01:27 PM IST
Kerala actor sreejith ravi arrested for allegedly flashes minor girls

స్కూల్ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు రుజువు కావటంతో నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మళయాళ నటుడు శ్రీజిత్ రవి పాతిక పైగా చిత్రాల్లో విలన్ గా నటించాడు. గత నెల 27న పాలక్కాడ్ లోని ఓ పాఠశాల సమీపంలో తన కారు ఆపిన శ్రీజిత్ నగ్నంగా మారి, తమ వైపు చూస్తూ అసభ్యంగా సైగలు చేశాడని, ఆపై ఫోటోలు కూడా తీశాడని కొందరు విద్యార్థినులు ఆరోపించారు.

ఈ విషయం స్కూల్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె పోలీస్ ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి ఉన్న కారు నంబర్‌ను పోలీసులకు అందజేశారు. ఆ కారు ఎవరిదని ఆరాతీస్తే.. అది ప్రముఖ నటుడు శ్రీజిత్‌ రవిదని తేలింది. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. అయితే, తాను స్కూలు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్టు వచ్చిన ఆరోపణలను శ్రీజిత్‌ రవి కొట్టిపారేశారు. వారు పొరపడి ఉంటారని చెప్పుకొచ్చాడు.

అయితే విద్యార్థినులు అతన్ని గుర్తుపట్టడంతో విషయం కన్ఫర్మ్ చేసుకున్న  పోలీసులు శ్రీజిత్ ను అరెస్ట్ చేసి పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. 40 ఏళ్ల ఈ నటుడికి భార్యా, కొడుకు ఉన్నారు. ఓ పాపులర్ నటుడు ఇలాంటి కేసులో అరెస్ట్ కావటంతో మాలీవుడ్ లో సంచలనంగా మారింది. నేరం రుజువైతే అతనికి ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Mollywood  actor  Sreejith Ravi  minor girls  arrested  

Other Articles