జనతా గ్యారేజ్ మొదటి రోజు కలెక్షన్లు | janatha garage 1st day over all collections

Janatha garage 1st day over all collections

NTR janatha garage collections, NTR janatha garage day 1 collections, NTR day 1 overseas collections, janatha garage malayalam talk, janatha garage malayalam collections

NTR janatha garage 1st day over all collections.

గ్యారేజ్ ఓవరాల్ ఏంటీ పరిస్థితి?

Posted: 09/02/2016 03:06 PM IST
Janatha garage 1st day over all collections

జనతా గ్యారేజ్ మిక్స్ డ్ టాక్ తో రన్ అవుతున్న ఈ చిత్ర ఫలితాన్ని మరో మూడు రోజులు గడిస్తేనే కానీ చెప్పలేం. కాస్టింగ్, కథ బలంగానే ఉన్నప్పటికీ, ఎటోచ్చి దాని ప్రెజెంట్ చేయటంలోనే కొరటాల తడబడ్డాడంటూ జూనియర్ ఫ్యాన్స్ గొణుక్కుంటున్నారు. అవన్నీ పక్కనబెడితే ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 20.49 కోట్ల షేర్ రాబట్టి కలెక్షన్ ల పరంగా ఎన్టీఆర్ స్టామినాను రుజువు చేసి టాప్-3 ప్లేస్ లో నిలించింది.

ఈ విషయంలో బాహుబలి 22.40 కోట్లతో మొదటి స్థానంలో, సర్దార్ గబ్బర్ సింగ్ 20.92 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. ఇక ఏరియాల వైజ్ గా చూసుంటే.. నైజాంలో 5.51 కోట్లు రాబట్టి బాహుబలి తర్వాతి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణ, గుంటూరు, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో హయ్యేస్ట్ కలెక్షన్లు రాబట్టి నట్లు సమాచారం. ఓవర్స్ సీస్ లో కూడా పై రెండు చిత్రాల తర్వాత మూడో స్థానంలో నిలిచి శ్రీమంతుడు రికార్డులను చెరిపివేసింది.

ఇక మళయాళ వర్షన్ లో మోహన్ లాల్ రిలీజ్ చేసినప్పటికీ పెద్దగా ప్రమోషన్ చేయకపోవటంతో కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. లాల్ బ్యానర్ మాక్స్ లాబ్ సినిమా 120 స్క్రీన్ లలో విడుదలైంది. మౌత్ టాక్ తో యావరేజ్ టాక్ రావటం సినిమాకు గట్టి దెబ్బే వేసింది. అయితే వీకెండ్ కావటం, మోహన్ లాల్ అక్కడి చానెళ్లలో ప్రచారం మొదలుపెట్టడంతో నెమ్మదిగా పుంజుకునే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా గ్యారేజ్ తో ఎన్టీఆర్ సినిమా బిజినెస్ పరిధి ఓ రేంజ్ లో పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : NTR  janatha garage  day 1 collections  

Other Articles