shruthi to lent her vocal box for tamanna

Shruti s sentiment worrying tamanna

Tamanna, Shruti Haasan, Tevar, Aagadu, Shruti Haasan Songs, shruthi songs debacles, shruthi movies, tamanna movies, vishal movies, vishal, Kathi Sandai, okkadochadu, kollywood

The makers of Vishal starrer 'Kathi Sandai' have planned to bring in Shruti Hassan for singing a song is worrying Tamanna as most of the films turned as debacles.

తమన్నా చిత్రంలో శృతి హసన్ కు ఏం పని..?

Posted: 08/28/2016 01:44 PM IST
Shruti s sentiment worrying tamanna

మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న సౌత్ స్టార్ వారసురాలు శృతిహాసన్.. విశాల్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కత్తి సండెయ్ లో వేలు పెడుతుంది. అది కాస్తా అ చిత్రం హీరోయిన్ తమన్నాను కలవరపెడుతోంది. అసలు తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రంలో శృతికి ఏం పని అంటూ కూడా వాదన తెరపైకి వస్తుంది. విషయానికి వస్తే.. నటిగానే కాక.. గాయనిగా కూడా ఆకట్టుకుంటున్న శృతి అటు గాయనిగా కూడా మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో పాటలు పాడింది. అయితే ఎక్కువగా తను నటించిన సినిమాల్లో మాత్రమే పాటలు పాడే శృతి.. అప్పుడప్పుడు ప్రైవేట్ సాంగ్స్ తోనూ ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ బ్యూటి మరో హీరోయిన్ కోసం పాట పాడేందుకు రెడీ అవుతోంది. తమిళ్లో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న కత్తి సండెయ్ సినిమాలో తమన్నా కోసం శృతిహాసన్ ఓ పాట పాడనుంది. విశాల్తో పాటు తమన్నాతో కూడా శృతికి మంచి రిలేషన్ ఉండటంతో ఈ పాట పాడేందుకు అంగీకరించింది. అయితే ఇదే విషయంలో తమన్నా కొంత కలవరానికి గురవెతుందట. ఎందుకంటే శృతి గాయనిగా మారి పాటలు పాడిన చిత్రాలు అంతగా ప్రక్షకాదరణకు నోచుకోకపోవడమే కారణమట. ఇదే సెంటిమెంట్ తమన్నాను కలవరపాటుకు గురిచేస్తుందట. విశాల్ కత్తి సండేయ్ చిత్రానికి తమిళ స్టార్ మ్యూజిషియన్ హిప్ హాప్ తమీజా సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. కత్తి సండెయ్ తెలుగు ఒక్కడొచ్చాడు పేరుతో రిలీజ్కు రెడీ అవుతోంది. మరి శృతితో పాటు తమన్నాకు కూడా అల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruthi Haasan  tamanna  vishal  Kathi Sandai  okkadochadu  kollywood  

Other Articles