పవన్ అభిమానిని హత్య చేసిన మరో హీరో ఫ్యాన్ | Pawan Kalyan fan murdered by another hero fan

Pawan kalyan fan murdered by another hero fan

Mega-Nandamuri Fans clash killed, Pawan fan Vinod Royal, Pawan Tirpathi fan murder, Pawan Kalyan fan killed by NTR fan, NTR fan killed Pawan Fan, Mega-Nandamuri Fans Clash, Pawan Kalyan fan Killed

పవన్ అభిమానిని హత్య చేసిన మరో హీరో ఫ్యాన్ | Pawan Kalyan fan murdered by another hero fan

పవన్ అభిమానిని హత్య చేసిన మరో హీరో ఫ్యాన్

Posted: 08/23/2016 11:21 AM IST
Pawan kalyan fan murdered by another hero fan

హీరోలపై ఉండే పిచ్చి ప్రేమతో అభిమానులు సోషల్ మీడియాలో రచ్చకెక్కడం, ఫ్లెక్సీల విషయంలో రోడెక్కి గొడవలకు దారి తీయటం గతంలో విన్నాం చూశాం. కానీ, ఆ వివాదం ముదిరి హత్యకు దారితీయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్పంటూ ఇద్దరు హీరోలకు చెందిన అభిమానులు చేసిన ఫైట్ లో చివరికి ఒకరికి ప్రాణం పోయింది.

పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన తిరుపతి యువకుడు వినోద్ రాయల్ జనసేనకు సంబంధించి నగరంలోనే కాకుండా చిత్తూరు జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం కర్ణాటక లోని కోలార్ లో జరిగిన ఓ ఫ్యాన్స్ ఈవెంట్ కు హాజరయ్యాడు. కార్యక్రమం అయ్యాక ఫ్రెండ్స్ తో కూర్చుని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుడగా, ఓ వ్యక్తి తమ హీరోనే  గొప్ప అంటూ వాగ్వాదానికి దిగాడు.

ఈ క్రమంలో ఆగ్రహావేశాలకు గురైన మరో హీరో అభిమాని వినోద్ ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ వినోద్ ను మిత్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చేసేది లేక నిన్న తిరుపతికి వినోద్ మృతదేహాన్ని తీసుకురాగా... అతడి అంత్యక్రియలకు భారీగా జనం హాజరయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు, అక్షయ కుమార్ ను‌, అతనికి సహకరించిన మరికొందరిని వేమగల్ పోలీసులు అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Fan  murder  Vinod Royal  Kolar  

Other Articles