మెగా అభిమానులకు సారీ చెప్పిన రాంగోపాల్ వర్మ | RGV sorry to mega fans on Chiru 150 first look

Varma says sorry to megafans on chiru 150 first look

Ram Gopal Varma sorry to Mega Fans, Varma on Chiru First Look

Ram Gopal Varma sorry to Mega Fans on Chiru First Look.

చిరు అభిమానులకు సారీ చెప్పిన వర్మ

Posted: 08/23/2016 10:35 AM IST
Varma says sorry to megafans on chiru 150 first look

ఏదైనా అనడానికి, ఏదైనా చేయడానికి ఏ మాత్రం సిగ్గు, భయపడని దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంట్రవర్సరీ అవుతాయని తెలిసినా నోటికి పని చెబుతూనే ఉంటాడు. అయితే, అలా అనడంలో తన తప్పుందని గ్రహిస్తే వెంటనే క్షమాపణలు కూడా చెబుతాడు లెండి. ప్రస్తుతం మెగాస్టార్ అభిమానులకి కూడా క్షమాపణలు చెప్పేశాడు.

చిరు 150 విషయంలో మొదటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. రీమేక్ ఎంచుకుని మెగాస్టార్ పెద్ద తప్పు చేశాడని, సందేశాత్మక చిత్రాలతో రాణించలేడని పేర్కొని విమర్శలే ఎదుర్కున్నాడు. అయితే ఆ సమయంలో ఓవైపు తిట్లు పడుతున్నా తన కామెంట్లకు మాత్రం కట్టుబడి ఉంటానని వర్మ భీష్మించుకుని కూర్చున్నాడు. ఇక రీసెంట్ గా టైటిల్ విషయంలోనూ అదే పని చేశాడు. 'ఖైదీ నెం.150' ఏమీ బాగోలేదంటూ వర్మ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.  దీనిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఆయనపై దుమ్మెత్తిపోశారు.

అయితే, ఫస్ట్ లుక్ చూశాక వర్మ తన మనసు మార్చుకున్నాడంట. అందుకే మెగా ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పాడు. "ఈ ఫస్ట్ లుక్ చూశాక గతంలో నేను చేసిన విమర్శలకు మెగా ఫ్యాన్స్ కు అపాలజీ చెబుతున్నాను. అసలు మెగాస్టార్ కెరీర్లోనే ఇది బెస్ట్ లుక్. సూపర్ గా వుంది... రాకింగ్..." అంటూ వర్మ తాజాగా ట్వీట్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా పోస్ట్ చేసేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  sorry  Mega Fans  150  first look  

Other Articles