గ్యారేజ్ ఆడియో వేడుకలో నిత్యామీనన్ | nithya menon speech at Janatha Garage audio launch

Nithya menon speech at janatha garage audio launch

Nithya menon speech at Janatha Garage audio, Nithya menon about NTR, Nithya menon about Koratala siva, Nitha menon about Janatha Garaje, Nithya menon Character in Janatha Garage

Nithya menon speech at Janatha Garage audio launch

నిత్యా మొత్తం మార్కులు కొట్టేసింది

Posted: 08/13/2016 08:12 AM IST
Nithya menon speech at janatha garage audio launch

సాధారణంగా స్టార్ డమ్ ఎక్కువయిన కొద్దీ హీరోయిన్లకు కాస్త పొగరు ఆటోమేటిక్ గా ఎక్కువైపోతుంటుంది. ఫంక్షన్లలో ఓవర్ గా మాట్లాడటం, సౌకర్యాల కోసం నిర్వాహకులను టార్చర్ పెట్టడం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ, సౌత్ లో ఇప్పుడు అగ్ర హీరోయిన్ రేంజ్ కి ఎదిగి కూడా నిత్యామీనన్ ఒదిగి ఉండటం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది.

కెరీర్ లో తొలిసారిగా పెద్ద హీరోతో సినిమా చేయటమేకాదు, ఓ పెద్ద కమర్షియల్ సినిమాలో నటించాలన్న కోరిక ఇంత కాలానికి తీరిందంటూ జనతా గ్యారేజ్ ఆడియో పంక్షన్ లో మాట్లాడింది. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ స్టామినా ఉన్న నటుడు, తాను జర్నీ చేస్తున్న సమయంలో లేదా అభిమానులు కలిసినప్పుడు జూనియర్ తో సినిమా ఎప్పుడు అని అడుగుతుండేవారు. వారి ఆశలతోపాటు, పెద్ద సినిమా హీరోతో తీయాలన్న నా కోరిక ఈ జనతా గ్యారేజ్ తో తీరిపోయిందని చెప్పుకోచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన కొరటాల శివకు స్పెషల్ థాంక్స్ అంటూ చెప్పుకోచ్చింది.

నిజానికి ఈ సినిమాలో మెయిన్ హీరో సమంత అని ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో, కేవలం ఓ కీలకపాత్రలోనే నిత్య కనిపించబోతుందని తెలుస్తోంది. అయినా ఆడియో పంక్షన్ వచ్చి, సమంత లేని లోటును పూడుస్తూ మొత్తం నిత్యానే స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. స్టార్ హీరోయిన్ అయి ఉండి ఇందులో లీడ్ కాకపోయినా ఆమె మాట్లాడిన స్పీచ్ వింటే నిత్య ఎంత మెచ్యూర్డో అనుకోక ఉండగలమా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithya Menon  Janatha garage  Audio launch  

Other Articles