జనతా గ్యారేజ్ ఆడియో లాంఛ్ లో ఎన్టీఆర్ స్పీచ్ | NTR emotinal speech at Janatha Garage Audio Launch

Ntr emotinal speech at janatha garage audio launch

NTR emotinal speech at Janatha Garage Audio, NTR at Janatha Garage Audio, NTR Janatha Garaje Audio Launch, Janatha Garaje Audio Highlights

NTR emotinal speech at Janatha Garage Audio Launch.

మీకోసం మళ్లీ మళ్లీ పుట్టాలని ఉంది

Posted: 08/13/2016 06:41 AM IST
Ntr emotinal speech at janatha garage audio launch

ప్రతీ ఆడియో పంక్షన్ లో అభిమానుల రుణం తీర్చుకుంటానని చెబుతుంటాను కానీ అది ఈ జన్మలో తీరేలా కనిపించడం లేదంటూ మరోసారి ఎమోషనల్ స్పీచ్ తో కొట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. శుక్రవారం సాయంత్రం శిల్పకళావేదికలో జరిగిన 'జనతా గ్యారేజ్' ఆడియో వేడుకలో భావోద్వేగంతో జూనియర్ ప్రసంగించాడు. అభిమానులు చూపించే ఈ ప్రేమ కోసం మళ్లీ మళ్లీ మళ్లీ పుట్టాలని ఉందని అన్నాడు.

‘‘ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఆ మహానుభావుడికి మనవడిగా, అద్భుతమైన వ్యక్తికి కొడుకుగా పుట్టానని, ఇంత మంది ప్రేమకు పాత్రుడనయ్యానని అన్నాడు. ఈ ప్రేమ కోసం మళ్లీ మళ్లీ పుట్టాలని అనిపిస్తుందని తెలిపాడు. తొలి చిత్రం నిన్ను చూడాలని సినిమా చేసినప్పుడు ఏం చేస్తున్నానో, ఎందుకు నటిస్తున్నానో తెలిసేది కాదని అన్నాడు. చాలా సినిమాలు చేస్తున్నంత కాలం ఇదే పరిస్థితి ఎదురైంది కానీ, 'టెంపర్' తో మిమ్మల్ని ఆనందపరచగలిగాను, ఆ తరువాత 'నాన్నకు ప్రేమతో' సినిమాతో తన గమ్యం మరింత దగ్గరైందని తెలిపాడు. 'జనతా గ్యారేజ్' సినిమాతో తన గమ్యానికి మరింత చేరవయ్యానని ఆయన చెప్పాడు.

రెండేళ్ల క్రితం ఫ్లాప్ సినిమాల్లో బిజీగా ఉండి, కొరటాల శివ సినిమా కథ చెప్పగా విన్నానని, అప్పుడు చేయడానికి ధైర్యం చేయలేదని ఆయన గుర్తు చేసుకున్నాడు. పుష్కర కాలంలో తనకు కొరటాల శివ పెద్ద హిట్ ను ఇస్తాడని అన్నాడు. ఒక అద్భుతమైన కథను, రచయిత కోణంలో రాసి, దర్శకుడి దృష్టితో కొరటాల శివ తీశాడని పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ సినిమా ద్వారా తాను ఓ గొప్ప నటుడి కంటే, గొప్ప మనిషిని కలిశానని, గొప్ప మనిషి కంటే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని కలిశానని...ఆ వ్యక్తి మోహన్ లాల్ అని ఆయన తెలిపాడు. పని పట్ల దేవిశ్రీ ప్రసాద్ కు ఉండే తపన ఇంకెవరికీ ఉండదని ఆయన తెలిపాడు. పుష్కరాలకు వచ్చే ఇతర రాష్ట్రాల వారికి తెలుగుదనం ఉట్టిపడేలా స్వాగతం చెప్పి...తెలుగుదనం ఎంత గొప్పదో తెలుసుకునేలా చేయాలంటూ అభిమానులకు ఓ సందేశం ఇస్తూ ముగించాడు ఎన్టీఆర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garaje  Audio Launch  

Other Articles