రాంచరణ్ ధ్రువ ఫ్రీ లుక్ పోస్టర్ విడుదల | Ram Charan Dhruva pre look poster

Ram charan dhruva pre look poster

Ram Charan Dhruva, Dhruva pre look poster, Dhruva pre look poster copy, Dhruva pre look poster hollywood, Charan Copy look

Ram Charan Dhruva pre look poster.

చెర్రీ ధ్రువ ఇంతలో ఏమైంది?

Posted: 08/12/2016 01:26 PM IST
Ram charan dhruva pre look poster

మెగా అభిమానులు రాంచరణ్ తాజా చిత్రమైన 'ధ్రువ' ఫస్టులుక్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తని ఒరువన్ లాంటి బ్లాక్ బస్టర్ రీమేక్ తో అయినా చెర్రీ విమర్శలకు చెక్ పెట్టి యాక్టింగ్ లో తనను తాను ప్రూవ్ చేసుకోవటంతోపాటు, హిట్ అందుకుంటాడా అని అంతా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా ఫస్టులుక్ ను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్టుగా ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లోపే సినిమా ప్రీ లుక్ ను రిలీజ్ చేసేశాడు చెర్రీ. చరణ్ వెనకాల నుంచి చూపిస్తూ ఉన్న ఈ పోస్టర్ లో బోర్డుపై ఏదో రాస్తూ స్కెచ్ లాంటి ఫోటోను రిలీజ్ చేశారు.

'నా శత్రువే నా బలం' అనే మైండ్ గేమ్ కి సంబంధించిన కాన్సెప్ట్ అనే విషయాన్ని, ఈ పోస్టర్ ద్వారా అర్థమయ్యేలా డిజైన్ చేసిన తీరు బాగుంది. ప్రీ లుక్ ఇంతలా అదరగొడుతూ ఉందంటే, ఇక ఫస్టు లుక్ ఏ స్థాయిలో ఉంటుందో ఏమో చూడాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మాతృకలో విలన్ గా మెప్పించిన అరవింద్ స్వామి ఇందులోనూ అదే పాత్ర పోషించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva  Pre look poster  Rakul  

Other Articles