జనతా గ్యారేజ్ ఆడియో విడుదలకు ఏర్పాట్లు పూర్తి | Janatha Garaje Audio list released

Get set for janatha garaje audio function track list released

NTR Janatha Garaje Audio, NTR Janatha Garaje Audio function, Janatha Garaje audio function, NTR at Janatha Garaje audio, samantha at Janatha Garaje Audio, Samantha last speech, Samantha Last movie, Mahest at Janatha Garaje Audio

NTR Janatha Garaje Audio release today. Devi Sri Prasad composed tunes track list released.

జనతా గ్యారేజ్ ఆడియో వేడుకకు సర్వం సిద్ధం

Posted: 08/12/2016 12:04 PM IST
Get set for janatha garaje audio function track list released

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ జనతా గ్యారేజ్ పాటల సందడికి సర్వం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈరోజు (ఆగష్టు 12 శుక్రవారం) హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా ఆడియో వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేసేస్తున్నారు. రాకింగ్ మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన బాణీలపై అప్పుడు డిస్కషన్ లు మొదలయ్యాయి. దీనికి తోడు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఆడియో ట్రాక్ లిస్ట్ ను రిలీజ్ చేయటంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇక ఇందులోని పాటల విషయానికొస్తే... ప్రణామం అంటూ సాగే పాటను ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించాడు. అనారోగ్య కారణాలతో గత కొంత కాలంగా టోటల్ గా పాటలకే దూరం అయిన ఆయనతో దేవీ ఈ డివోషనల్ గా ఉండబోయే పాట పాడించడం విశేషం. 'జయహో జనతా .. ' అనే పాటను బాలీవుడ్ సింగర్ సుఖ్వీందర్ సింగ్, యువ సింగర్ విజయ్ ప్రకాష్ లు కలిసి ఆలపించారు. ఇక గతంలో లీకైన పాట  'యాపిల్ బ్యూటీ ..' యథాతథంగానే ఉంచారు. లీకయిన పాటను దేవీ ఆలాపించగా, ట్రాక్ లో మాత్రం యాజిన్ నజీర్, నేహాబాసిన్ పాడారు. 'నీ సెలవడిగి ..' 'నేను పక్కా లోకల్ ..' అనే పాటలు కూడా ట్రాక్ లిస్టులో కనిపిస్తున్నాయి.

వరుస హిట్లతో ఉన్న యంగ్ టైగర్ కి తోడు మళయాళ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించడం, పైగా బ్యాక్ టూ బ్యాక్ రెండు భారీ హిట్లతో ఉన్న కొరటాల శివ దర్శకుడు కావటంతో చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. నిత్యామీనన్, సమంతలు ఎన్టీఆర్ కి జోడీగా కనిపించనున్నారు. పాటలు చేసే సందడిని ఈ రోజు రాత్రికి ప్రత్యక్షంగా చూసేయవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garaje  audio launch  Mohan Lal  Koratala Shiva  

Other Articles