టాయిలెట్స్ తో కబాలి | Puducherry Govt Free Kabali Tickets For Building Toilets

Puducherry govt free kabali tickets for building toilets

Kabali toilets, Puducherry Government Kabali Offer, Toilets for Kabali, For Kabali build toilets

Puducherry Government announces Free Kabali Tickets For who building toilets in their home.

టాయిలెట్స్ తో కబాలి డా...

Posted: 07/01/2016 05:52 PM IST
Puducherry govt free kabali tickets for building toilets

ముసలి మాఫియా డాన్ ‘కబాలి’ కోసం సౌత్ కాదు యావత్ దేశం కాదు కాదు... టోటల్ ప్రపంచమే ఎదురుచూస్తోంది. అంచనాలు నానాటికీ పెరిగిపోతుండటంతో దానిని క్యాష్ చేసుకునేందుకు కూడా అంతా చూస్తున్నారు. ఎయిర్ ఏసియా ఇండియా అయితే నెలరోజులు కష్టపడి ఏకంగా ఓ ఫ్లైట్ నే సిద్దం చేసింది. అందుకు తగ్గట్లుగానే ఆఫర్లను ప్రకటించింది. బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణె, జైపూర్, వైజాగ్ లాంటి పలు నగరాలకు ‘కబాలి’ ఫ్లయిట్ సేవలందించనుంది.

ఇక రజనీ కాంత్ క్రేజ్ ను మరోలా వాడుకుంటుంది పుదుచ్చేరి. తలైవాను ఒక్క తమిళనాడులోనే కాదు పొరుగున ఉన్న పుదుచ్చేరిలో కూడా దేవుడిలా పూజిస్తారు. దీంతో ఆయన సినిమా పేరుతో ఓ బృహత్ కార్యానికి  ఆ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ‘సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ టిక్కెట్స్ ఉచితంగా పొందాలంటే .. మీ ఇంట్లో టాయిలెట్స్ నిర్మించుకోండి’ అంటూ ప్రచారం మొదలుపెట్టింది.

పుదుచ్చేరిలో 772 నివాసాలకు గానూ 447 ఇళ్లలో మరుగుదొడ్లు లేవు. దీంతో ఈ బంపరాఫర్ తోనైనా సగం మంది ఇళ్లు కట్టుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపధ్యంలో రజనీ మేనియాతో అయిన పని పూర్తయితే చాలని అంతా అనుకుంటున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  rajanikanth  Puducherry  toilets  

Other Articles