Kondaveeti Simham not fixed for balayya

Kondaveeti simham not fixed for balayya

Kondaveeti simham, Balakrishna Kondaveeti simham, Kondaveeti Simham not fixed, Kondaveeti Simham fake news

Kondaveeti Simham title not fixed for balaKrishna Movie.

కొండవీటి సింహం అంతా బుస్

Posted: 07/01/2016 05:09 PM IST
Kondaveeti simham not fixed for balayya

నందమూరి వంశానికి నిజమైన నటవారసుడిగా తండ్రి బాటలోనే ఓవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు రాజకీయాలను బాలెన్స్ చేస్తున్నాడు నటసింహ బాలకృష్ణ. అయితే 42 ఏళ్ల సినీ కెరీర్ లో ఏనాడూ తండ్రి సినిమాల రీమేక్ ల జోలికిగానీ, పాటలనుగానీ, టైటిల్ ను కానీ అంతగా వాడుకున్న పాపాన లేదు. అయినా ఆ తరహాలోనే పవర్ ఫుల్ టైటిల్స్ తోనే బాలయ్య హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు.

అయితే తన రాబోయే సినిమా కోసం మాత్రం బాలయ్య మొదటిసారి ఆ సంప్రదాయానికి తెర దించబోతున్నాడని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి ఆ తర్వాత రైతుల సమస్యపై ఓ చిత్రాన్ని తీయబోతున్నాడనేది తెలిసిందే. వీటి తర్వాత తీయబోయే సినిమాకు కొండవీటి సింహం అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది. అయితే అదంతా ఉత్తదేనని ఇప్పుడు సమాచారం అందింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ తీయబోయే చిత్రానికి ముందుగా రామారావు గారు అనే టైటిల్ ను అనుకున్నారంట. అయితే పోలీస్ కాన్సెప్ట్ తో కూడిన ఈ చిత్రానికి పవర్ ఫుల్ గా ఉండేందుకు కొండవీటి సింహం టైటిల్ ను ఫిక్స్ చేశారని చెప్పారు. అయితే ఎన్టీఆర్ సినిమా టైటిళ్లపై గౌరవంతో దానిని వాడొద్దని బాలయ్య సూచించాడంట. దీంతో ఆ టైటిల్ కూడా కన్ఫర్మ్ కాలేదని తెలుస్తోంది. సో... రెండు రోజులుగా కొండవీటి సింహం మీద వస్తున్నవన్నీ ఉత్తవేనని ఈ వార్తతో తేలిపోయింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : senior NTR  Kondaveeti simham  Balakrishna  

Other Articles