కన్నడ సొగ్గాడిగా మారుతున్న ఉపేంద్ర | Upendra in Soggade Chinni Nayana remake

Upendra in soggade chinni nayana remake

Soggade Chinni Nayana remake, Soggade Chinni Nayana in kannada, Upendra in Soggade Chinni Nayana, Prema in Soggade Chinni Nayana, Upendra prema again in SCN, Soggade Chinni Nayana kannada remake

Upendra in Soggade Chinni Nayana remake: Upendra will reportedly star in the Kannada remake of Telugu blockbuster Soggade Chinni Nayana.

కన్నడ సొగ్గాడిగా మారుతున్న ఉపేంద్ర

Posted: 05/26/2016 04:27 PM IST
Upendra in soggade chinni nayana remake

నాగార్జున హీరోగా నటించిన ‘సొగ్గాడే చిన్నినాయనా’ చిత్రం తెలుగులో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తండ్రి కొడుకులుగా నాగార్జున ద్విపాత్రాభినయం చేసారు. నాగార్జునకు జోడిగా అందాల భామలు రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీలు నటించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది.

అయితే ఈ సినిమాను కన్నడం భాషలోకి రీమేక్ చేయబోతున్నారు. కన్నడంలో నాగార్జున పాత్రలో ఉపేంద్ర నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనే తీసుకోనున్నారు. ఇక రమ్యకృష్ణ పాత్రలో నటి ప్రేమ నటించనుంది. సూమారు పదిహేడేళ్ల తర్వాత మళ్లీ ఉపేంద్ర-ప్రేమ జంటగా కలిసి నటించనున్న సినిమా ఇదే.

ప్రస్తుతం కన్నడ భాషకు సంబంధించి స్ర్కిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు జులై మొదటి వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. మరి కన్నడంలో ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Soggade Chinni Nayana  Upendra  Nagarjuna  

Other Articles