‘జనతా గ్యారేజ్’ కోసం తాతకు ప్రేమతో | NTR pays homage to late ntr

Ntr pays homage to late ntr

Janatha Garage Chennai Schedule Details, Janatha Garage Posters, Janatha Garage shooting updates, NTR Janatha Garage Movie updates, జనతా గ్యారేజ్, ఎన్టీఆర్, యంగ్ టైగర్, Janatha Garage stills, Janatha Garage working stills, Janatha Garage, మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్, NTR Movie Updates, NTR Movie Details, వార్తలు, రాజకీయాలు, ఆటలు, ఫోటోలు, NTR stills, NTR latest stills, NTR, Samantha hot stills, Samantha cleavage stills, Nithya menon latest stills

NTR pays homage to late ntr: Young Tiger NTR Janatha Garage Chennai Schedule Details. Koratala shiva director. Mytri Movie Makers Produce this film. Samantha, Nithya menon heroines.

‘జనతా గ్యారేజ్’ కోసం తాతకు ప్రేమతో

Posted: 05/26/2016 05:01 PM IST
Ntr pays homage to late ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం వరకు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ‘జనతా గ్యారేజ్’... రేపటి నుంచి చెన్నైలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. ఎన్టీఆర్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

అందువల్ల ఎన్టీఆర్ ఈరోజే చెన్నైకు బయలుదేరనున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఘాట్ ను సందర్శించుకునే జూనియర్ ఎన్టీఆర్, ఈ సంవత్సరం అదే రోజున చెన్నైలో ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ లో పాల్గొననున్నాడు. అందుకే ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి, తన తాతగారు అయినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ తో పాటు జనతా గ్యారేజ్ దర్శకులు కొరటాల శివ, నిర్మాతలు యలమంచిలి రవి మరియు మోహన్ సి వి ఎమ్ లు కూడా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించారు. ఇక సినిమా విషయానికొస్తే... కొరటాల శివ మార్క్ తో సాగే స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చెన్నై షెడ్యూల్ తర్వాత మళ్ళీ హైద్రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పాట చిత్రీకరణ జరగనుంది.

ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janatha Garage  NTR  Samantha  Nithya Menon  

Other Articles