రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు మృతి | Sindhura Puvvu director passes away

Sindhura puvvu director passes away

Sindhura Puvvu director passes away, Director Devaraju passes away, Director Devaraju death, Director Devaraju died, Director Devaraju road accident, Director Devaraju accident, Director Devaraju movies, Director Devaraju

Sindhura Puvvu director passes away: Sindhura Puvvu movie director PR Devraj met with an accident and died in a road mishap yesterday.

రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు మృతి

Posted: 05/25/2016 11:49 AM IST
Sindhura puvvu director passes away

ప్రముఖ తమిళ దర్శకుడు దేవరాజు(60) మృతి చెందారు. కర్నూలు జిల్లా డోన్ హైవే ఓబులాపురం మిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోయంబత్తూరు నుంచి దేవరాజు తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. ముందుగా బెంగుళూర్ వచ్చి, ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా రాత్రి మార్గ మధ్యంలో ఓబులాపురం మిట్ట హైవే వద్ద కారు ప్రమాదానికి గురయ్యింది.

ఈ కారు ప్రమాదంలో దేవరాజు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో వున్న దేవరాజు స్నేహితులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దేవరాజు మృతదేహాన్ని ముందుగా డోన్ హాస్పిటల్ కు తరలించి, ఆ తర్వాత కోయంబత్తూరుకు తరలించారు. దర్శకుడిగా దేవరాజుకు మంచి పేరుంది. తమిళంలో సింధురపువ్వు వంటి హిట్ చిత్రాలను అందించారు.

మూడు దశాబ్దాల పాటు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం తమిళంలో సీరియల్స్ కు దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈ మరణ వార్తతో తమిళ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తమిళ సినీ ఇండస్ట్రీ ఒక మంచి దర్శకుడిని కోల్పోయిందని చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Devaraju  Passes away  Sindhura Puvvu  

Other Articles