మూడో పాటకు ముహూర్తం ఖరారు | Saahasam Swasaga Sagipo Third Song Launch Date

Saahasam swasaga sagipo third song launch date

Saahasam Swasaga Sagipo 3rd song release on 26 May, Saahasam Swasaga Sagipo songs, Saahasam Swasaga Sagipo stills, Saahasam Swasaga Sagipo posters, Saahasam Swasaga Sagipo trailers, Saahasam Swasaga Sagipo videos, Naga Chaitanya

Saahasam Swasaga Sagipo Third Song Launch Date: Naga Chaitanya`s upcoming film Saahasam Swasaga Sagipo. This film 3rd song release on 26 May.

మూడో పాటకు ముహూర్తం ఖరారు

Posted: 05/25/2016 10:41 AM IST
Saahasam swasaga sagipo third song launch date

యువసామ్రాట్‌ నాగచైతన్య, డీసెంట్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఏమాయ చేసావె' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ హిట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విన్నర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల 'ఎల్లిపోమాకే.. ఎదనే వదిలి పోమాకే...' పాటను, 'షోకిల్లా' సాంగ్‌ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ఈ రెండు పాటలకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు మూడో పాటగా 'చకోరి'ని మే 26న సోషల్‌ మీడియాలో డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ విడుదల చేయబోతున్నారు. అదేరోజు యువసామ్రాట్‌ నాగచైతన్య, రచయిత, చిత్ర సమర్పకులు కోన వెంకట్‌లు కూడా 'చకోరి' పాటను ట్విట్టర్‌లో రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కోన వెంకట్‌ మాట్లాడుతూ.... నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌, ఎ.ఆర్‌.రెహమాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఏమాయ చేసావె' మ్యూజికల్‌గా ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తోన్న 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం కూడా మ్యూజికల్‌గా చాలా పెద్ద రేంజ్‌కి వెళ్ళబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని 'ఎల్లిపోమాకే.. ఎదనే వదిలి పోమాకే...', 'షోకిల్లా' పాటలు అందర్నీ అలరిస్తున్నాయి. మే 26న గౌతమ్‌ మీనన్‌ గారు ఈ చిత్రంలోని మూడో పాట 'చకోరి'ని సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చెయ్యబోతున్నారు. నేను, నాగచైతన్య కూడా ఈ పాటను ట్విట్టర్‌లో విడుదల చేస్తున్నాం. అదేరోజు 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం ఆడియో విడుదల తేదీని, సినిమా విడుదల తేదీని గౌతమ్‌ మీనన్‌గారు ఎనౌన్స్‌ చేస్తారు. ఈ పాట చిత్రంలో ఒక ట్రావెల్‌ సాంగ్‌గా వుంటుంది. వైజాగ్‌ నుంచి కన్యాకుమారి వరకు హీరో, హీరోయిన్‌ బైక్‌పై ట్రావెల్‌ చేస్తున్నప్పుడు వచ్చే ఈ పాట సినిమాకి పెద్ద హైలైట్‌ అవుతుంది. 'ఏమాయ చేసావె' తర్వాత నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో మరో మెమరబుల్‌ మూవీ అవుతుంది అన్నారు.

దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ మాట్లాడుతూ... ఈ చిత్రంలో నాగచైతన్య లుక్‌ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. అతని క్యారెక్టర్‌ని చాలా ఎక్స్‌లెంట్‌గా పెర్‌ఫార్మ్‌ చేశాడు. 'ఏమాయ చేసావె' తర్వాత ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రం కోసం మళ్ళీ అద్భుతమైన పాటల్ని చేశారు. ఆల్రెడీ రిలీజ్‌ అయిన పాటలకు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మా కాంబినేషన్‌లో ఇది మరో మ్యూజికల్‌ హిట్‌ అవుతుంది అన్నారు.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ.... ఈ చిత్రానికి సంబంధించి మేం మొదట విడుదల చేసిన 'ఎల్లిపోమాకే.. ఎదనే వదిలి పోమాకే...' పాటకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. యూ ట్యూబ్‌లో 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ రావడం చాలా సంతోషాన్ని కలిగింది. అలాగే ఆ పాట తర్వాత విడుదల చేసిన 'షోకిల్లా' మేకింగ్‌ వీడియోకు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు మే 26న ఈ చిత్రంలోని మూడో పాట 'చకోరి' విడుదలవుతోంది అన్నారు.

యువసామ్రాట్‌ నాగచైతన్య, మంజిమ మోహన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: డాన్‌మాక్‌ ఆర్థర్‌, ఎడిటింగ్‌: ఆంటోని, ఆర్ట్‌: రాజీవన్‌, ఫైట్స్‌: సిల్వ, రచన, సమర్పణ: కోన వెంకట్‌, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saahasam Swasaga Sagipo  Naga Chaitanya  Simbu  

Other Articles