అపూర్వను చంపాలనుకుంటున్నారా..? | Actor Apoorva got life threat

Actor apoorva got life threat

Apoorva, Actor Apoorva, అపూర్వ, యాక్టర్ అపూర్వ

Actor Apoorva complaints to police. She filed a complaint that she facing some threat calls from unknown persons.

అపూర్వను చంపాలనుకుంటున్నారా..?

Posted: 05/24/2016 12:19 PM IST
Actor apoorva got life threat

సినిమా స్టార్లు, సినిమా యాక్టర్లు అనగానే చాలా మందికి ఇష్టమే ఉంటుంది. వాళ్ల మీద ఎవరికీ కోపం ఉండదు. అందునా యాక్టర్లను చంపెయ్యాలి అన్నంత కోపం మాత్రం ఉండదు. కానీ తాజాగా ఓ తెలుగు యాక్టర్ తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కొంత మంది వ్యక్తులు తిరుగుతున్నారు అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరు అనుకుంటున్నారా..? సినీ నటి అపూర్వ.

తనకు ప్రాణ భయముందని సినీ నటి అపూర్వ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్ ఇన్ స్పెక్టర్‌ వహిదుద్దీన్‌ తెలిపిన వివరాల మేరకు... ఈ నెల 21న ఫిలిం సిటీ సమీపంలోని చౌటుప్పల్‌ వద్ద జరిగిన ప్రమాదంలో అపూర్వ కారుని మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అపూర్వ కారు పూర్తిగా దెబ్బతినడంతో.. మరమ్మతులు చేయించడానికి యాక్సిడెంట్ చేసిన వారు ఒప్పుకున్నారట. అంతేకాకుండా కారు రిపేరు పూర్తయ్యే వరకు వారి కారును కూడా అపూర్వ వద్దే ఉంచేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల తనకు బెదిరింపు ఫోన్‌ కాల్స్ వస్తున్నాయని, సిద్ధార్థనగర్‌ లో తాను ఉండే ఇంటి వద్ద పలువురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సినీ నటి అపూర్వ పోలీసులకు నిన్న రాత్రి ఫిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles