ఎంఎల్ఎపై వర్మ వివాదాస్పద ట్వీట్లు | RGV Contraversial tweets about a BJP MLA

Rgv contraversial tweets about a bjp mla

RGV, Ram Gopal Var,a. BJP, Ache Din, Angoolataji, అంగూర్ లత, మోదీ, రాంగోపాల్ వర్మ, ఆర్జివి

RamGopal Varma tweet getting sensation in politics. He posted a post about A MLA from Assam. He wrote that If MLA can look like this,Achche din aagaye hai..Thank you Angoorlataji,Thank you Modiji..1st time I love politics

ఎంఎల్ఎపై వర్మ వివాదాస్పద ట్వీట్లు

Posted: 05/24/2016 01:08 PM IST
Rgv contraversial tweets about a bjp mla

కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రస్ గా మారారు రాంగోపాల్ వర్మ. డైరెక్టర్ గా కన్నా కూడా కాంట్రవర్సియల్ ట్వీట్స్ చేసే వ్యక్తిగా వార్తల్లో ఎక్కువగా నిలిచే రాంగోపాల్ వర్మ తాజాగా మరోసారి వివాదాస్పద ట్వీట్లు చేశారు. మొన్న మహేష్ బాబు బ్రహ్మోత్సవం మీద ట్వీట్లు చేసి అందరికి షాకిచ్చిన రాంగోపాల్ వర్మ.. తాజాగా ఏకంగా ఓ ఎమ్మెల్యే మీదే షాకింగ్ ట్వీట్లు చేశాడు. తనము మొదటి సారి పాలిటిక్స్ అంటే లవ్ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు మోదీకి కూడా తన ట్వీట్ తో ధ్యాంక్స్ చెప్పాడు.


ఇంతకీ మ్యాటర్ ఏంటీ అంటే తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి తొలిసారి అసోంలో అధికారంలోకి వచ్చింది. అక్కడి బిజెపి ప్రభుత్వం ప్రస్తుతం కొలువుదీరి ఉంది. అయితే అసోంకు తాజాగా ఎన్నికైన అంగూర్ లతా అనే మహిళా ఎమ్మెల్యే ఫోటోను పెట్టి.. ఒక ఎమ్మెల్యే ఇ:త అందంగా ఉంటే.. అచ్చేదిన్ వచ్చేసినట్లే, ధ్యాంక్యూ అంగూర్ లతా, మోదీగారు, మొదటిసారి రాజకీయాలంటే ఇష్టం కలుగుతోంది అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చెయ్యడం దుమారాన్ని రేపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles