RGV | Veerappan | Hindi Poster | Tweets

Rgv veerappan first look

RGV Veerappan Hindi Poster, Veerappan posters, Veerappan latest updates, Veerappan stills, RGV latest tweets, RGV latest updates

RGV Veerappan First Look: Ram gopal varma upcoming film Veerappan. This film poster released.

రీమేక్ కాదు.. రీమేడ్ అంటున్న వర్మ

Posted: 04/13/2016 10:28 AM IST
Rgv veerappan first look

రాంగోపాల్ వర్మ చాలాకాలం తర్వాత మరోసారి హిట్టు కొట్టిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. వీరప్పన్ జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగు, కన్నడంలోకి విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఇపుడు ఇదే చిత్రాన్ని హిందీలో విడుదల చేయనున్నాడు. చూడటానికి కాన్సెప్ట్ ‘కిల్లింగ్ వీరప్పన్’ కథే. కానీ వర్మ మాత్రం ఇదీ రీమేక్ చిత్రం కాదు.. పూర్తిగా రీమేడ్ చేసిన చిత్రమంటూ చెబుతున్నాడు.

తాజాగా హిందీ వర్షెన్ కు చెందిన ‘వీరప్పన్‘ చిత్ర పోస్టర్ ను వర్మ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసాడు. ‘ఈ సినిమా కన్నడ సినిమాకు రీమేక్ కాదు, పూర్తిగా హిందీలో తెరకెక్కించిన సినిమా’ అంటూ వివరణ ఇచ్చాడు. పేరు, రీమేడ్ అని చెప్పినంత మాత్రన పాత్రలు, వాటి వేషాలు మాత్రం మారలేవు కదా! అందుకే జనాలు కూడా దీనిని ఈ డబ్బింగ్ చిత్రమనే అనుకుంటున్నారు. మరి వర్మ హిందీలో ఎలాంటి విజయం సొంతం చేసుకోనున్నాడో చూడాలి. వర్మ మార్క్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతన్న ‘వీరప్పన్’ మే27న రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  Veerappan  Hindi posters  Stills  Tweets  

Other Articles