Vijayendra Prasad | Baahubali | Prabhas | SS Rajamouli | Trailers

Vijayendra prasad reveals baahubali death

Vijayendra Prasad Talks about Baahubali, Vijayendra Prasad reveals Baahubali story, Baahubali latest updates, Baahubali shooting updates, Baahubali story leaked, Baahubali stills, Baahubali trailers, Baahubali movie

Vijayendra Prasad reveals Baahubali death: SS Rajamouli latest block buster hit film Baahubali. Prabhas, rana, anushka, ramyakrishnan, tamannah acts in lead roles. MM Keeravani music.

బాహుబలి బ్రతికే అవకాశం వుందట.. సస్పెన్స్

Posted: 04/13/2016 03:49 PM IST
Vijayendra prasad reveals baahubali death

‘బాహుబలి’ చిత్రాన్ని చూసినవారందరూ అడిగే ప్రశ్న, మదిలో మెదిలే ప్రశ్న ఒకే ఒకటి. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అని. ‘బాహుబలి’ చిత్రం గత ఏడాది జులైలో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగించి, కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.

ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసలు బాహుబలి హత్య చేయబడ్డాడని, మరణించాడని ఎందుకు భావిస్తున్నారు అంటూ ఎదురు ప్రశ్నించారు. బాహుబలి బతికివుండే అవకాశం కూడా వుందని మరో సస్పెన్స్ ను క్రియేట్ చేసారు.

ఇక ‘బాహుబలి’ సినిమా విడుదలకు ముందే సీక్వెల్ కు సంబంధించిన స్ర్కిప్ రాయడం పూర్తి చేసానని, ‘బాహుబలి’ సక్సెస్ తో సీక్వెల్ లో ఎలాంటి మార్పులు చేయడం లేదని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘బాహుబలి’ మించిన రేంజులో ‘బాహుబలి2’ వుండేందుకు చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకొని రూపొందిస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ‘బాహుబలి2’ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యం.యం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి2’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Vijayendra Prasad  SS Rajamouli  Kattappa  stills  

Other Articles