Lady doctor files case against actor Venu

Foreign lady s complaint on forgotten hero

Tollywood Hero, Venu Tottempudi, Venu fatemi, iranian doctor, dammu, Foreign Lady's Police Complaint On Forgotten Hero, Iranian Lady Fatemi complaints on Venu Tottempudi harrassment, Foreign Lady police complaint on Hero Venu

A tenant at Tollywood actor Thottempudi Venu’s house has filed a police complaint at Banjara Hills police station stating that her landlord is not ready to return the rental advance that she had paid.

హీరో తొట్టింపూడి వేణు దంపతులపై కేసు..

Posted: 04/10/2016 11:10 AM IST
Foreign lady s complaint on forgotten hero

అప్పట్లో కుటుంబ కధా చిత్రాలు, హాస్య చిత్రాలలో వెండి తెరను ఏలిన రోజుల్లో బిజీగా ఉన్న తొట్టింపూడి వేణు.. ఆ మధ్యన ఎన్టీఆర్ దమ్ము చిత్రంలో కనపడ్డారు. ఆ తర్వాత కనిపించకుండా పోయిన వేణు.. ఇన్నాళ్లకు వార్తల్లో వ్యక్తిగా మారాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ సెలబ్రిటీగా వుంటూ తన అపార్టుమెంటులో అద్దెకు దిగిన ఓ వైద్యురాలి నుంచి తీసుకున్న అడ్వాన్స్ వెనక్కు తిరిగి ఇవ్వడానికి నిరాకరించిడంతో ఆయనపై సదరు వైద్యురాలు పోలీసు కేసు పెట్టడంతో వార్తల్లో వ్యక్తిగా మారాడు,

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ బేగంపేటలో ఫౌతేమి డాక్టర్ గా బాద్యతలు నిర్వహిస్తున్నారు. ఏడు నెలల క్రితం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 రెసిడెన్సీలో వేణు కి చెందిన ఫ్లాట్ నెంబర్ 302 లో అద్దెకు తీసుకున్నారు ఆమె. ఫ్లాట్ అద్దె 29, 300. మూడు నెలలు అడ్వాన్స్ క్రింద ఎనభై ఎనిమిది వేలు చెల్లించారు. అయితే ఇప్పుడు ఆమె ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిందామె. అయితే తను ఇచ్చిన అడ్వాన్స్ ని తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు ఆ డాక్టర్.

ఇంటిని అద్దెకు తీసుకున్న వైద్యురాలు అ ఫ్లాటులోని ఫ్లోరింగ్ ను పాడు చేసిందని, వాటిని రిపేర్ చేయించడానికి డబ్బులు ఖర్చు అవుతాయని, అందుకోసం ఇచ్చిన అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వడం లేదని అమె పోలీసులకు పిర్యాదు చేశాడు, ఏడు నెలల తర్వాత ఫాతమీ ఇళ్లు ఖాళీ చేస్తూ అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వాలని కోరారు. ఫ్లోరింగ్‌ బీటలు వారిందని వేణు, ఆయ న భార్య డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారు. మరమ్మతుకయ్యే రూ.1000 మినహాయించుకొని డబ్బు ఇవ్వాలని కోరినా స్పందించలేదు. దీంతో ఫాతమీ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Hero  Venu Tottempudi  Venu fatemi  iranian doctor  dammu  

Other Articles