Malaika Arora | Arbaaz Khan | divorce | Salman Khan

Malaika arora divorce from arbaaz khan

Malaika Arora files for divorce from Arbaaz Khan, Malaika Arora files divorce, Malaika Arora divorce Arbaaz Khan, Malaika Arora Arbaaz Khan divorce, Malaika Arora divorce, Malaika Arora hot stills, Malaika Arora hot news, Malaika Arora latest updates, Malaika Arora

Malaika Arora divorce from Arbaaz Khan: Bollywood heroine Malaika Arora files for divorce from her husband Arbaaz Khan.

వీరి ప్రేమ, బ్రేకప్ విషయంలో జోక్యం చేసుకోము

Posted: 03/14/2016 01:29 PM IST
Malaika arora divorce from arbaaz khan

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు, ప్రముఖ నటుడు అర్బాజ్ ఖాన్ తన భార్య, నటి మలైకా అరోరాతో పూర్తిగా విడిపోవడానికి సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. గతకొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిగా వుంటున్నారని, అయితే వీరిద్దరిని కలిపేందుకు సల్మాన్ ఖాన్ కూడా ఎంతో ప్రయత్నించినప్పటికి... మలైకా మాత్రం అర్బాజ్ ఖాన్ తో విడిపోవడానికే సిద్ధమయినట్లుగా తెలుస్తోంది.

అర్బాజ్ ఖాన్ తో తెగదెంపులు చేసుకొని విడిపోయేందుకు మలైకా అరోరా నిర్ణయించుకొని విడాకులు కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అర్బాజ్ తండ్రి సలీం ఖాన్ స్పందిస్తూ... తానొక రచయితనని, ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ ల గురించి తనని అడగవద్దని తెలిపాడు. అలాగే తన పిల్లల విషయంలో తానేప్పుడూ జోక్యం చేసుకోనని, ఈ విషయంపై తనకు మాట్లాడాలని లేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలా వుంటే మలైకా అరోరా తల్లి జాయ్స్ పోలీకార్ప్ కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. అర్బాజ్-మలైకాలు ఎదిగినవారని, అది వారి వ్యక్తిగత వ్యవహారమని.. కాబట్టి వారి విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని, ఈ విషయంపై మాట్లాడటానికి కూడా తనకు ఇష్టంలేదని జాయ్స్ చెప్పుకొచ్చారు. మరి అర్బాజ్ ఖాన్-మలైకా అరోరాలు పూర్తిగా విడిపోతారో లేక మళ్లీ కలిసిపోతారో అనేది భవిష్యత్తులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malaika Arora  Divorce  Arbaaz khan  salman khan  stills  

Other Articles