తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందించిన ప్రెస్టీజియస్ సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘24’. గ్లోబర్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రంలోని మొదటి పాటను తాజాగా విడుదల చేశారు. ఏ.ఆర్.రెహమాన్ బాణీలందించిన ‘కాలం నా ప్రేయసి’ అనే ఈ పాటకు ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ సాహిత్యమందించారు.
ఈ చిత్రంలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ కీలక పాత్రలో నటించాడు. భారీ బడ్జెట్ తో కథానాయకుడు సూర్య నిర్మించిన ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... ఇటీవలే విడుదల చేసిన 24 చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టైమ్ ఆధారంగా నడిచే ఈ చిత్ర కథలో హీరో సూర్య విభిన్నంగా కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ఈ తరహా కథ, కథనాలు మనం చూడలేదు. దర్శకుడు విక్రమ్ కుమార్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను రూపొందించారు. ఎ.ఆర్.రెహమాన్ అద్భుతమైన బాణీలు చిత్ర కథకు ప్రాణం పోశాయి. అంతే కాదు రీ రికార్డింగ్ తో ప్రతీ సన్నివేశం అబ్బురపరుస్తుంది. చంద్రబోస్, శంశాంక్ వెన్నెలకంటి మంచి సాహిత్యమందించారు. ఈ చిత్ర ఆడియో కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా చంద్రబోస్ గారు రాసిన కాలం నా ప్రేయసి అనే పాటను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర పాటల్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తాం. అని అన్నారు.
సాంకేతిక నిపుణులు... సంగీతం : ఎ.ఆర్.రెహమాన్; సినిమాటోగ్రఫి - కె.తిరునాపుక్కరసు; ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి; ప్రొడక్షన్ డిజైన్ - అమిత్ రే మరియు సుభ్రదా చక్రబోర్తి; పాటలు - చంద్రబోస్ మరియు శశాంక్ వెన్నెలకంటి; సౌండ్ డిజైన్ - లక్ష్మీ నారాయణన్; సౌండ్ ఎఫెక్ట్స్ - ఇక్బాల్; యాక్షన్ - అన్బరివ్; కొరియోగ్రఫీ - రాజు సుందరం, బృంద, దినేష్, శ్రీధర్; విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - జులియన్ ట్రౌసెల్లియర్; మేకప్ - క్లోవర్ వూటాన్ మరియు ప్రీతి షీల్.జి.సింగ్; కాస్ట్యూమ్ డిజైన్- దర్శన్ జలన్, ఇషా-దివ్య మరియు నిధి-అనిషా; స్టిల్స్ - ఆర్.వెంకట్రామ్; పబ్లిసిటీ డిజైన్ - రైసింగ్ ఆపిల్, రెడ్ డాట్; పి.ఆర్.ఓ - ఎస్ కె ఎన్ మరియు ఏలూరు శ్రీను; ప్రొడక్షన్ కంట్రోలర్ - బి.సెంథిల్ కుమార్; లైన్ ప్రొడ్యూసర్ - ప్రశాంత్ వర్మ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శ్రేయాస్ కెదెకర్; అసోసియేట్ ప్రొడ్యూసర్ - సూరజ్ సాధనా; కో ప్రొడ్యూసర్ - రాజశేఖర్ కర్పూర పాండియన్; నిర్మాత - సూర్య; రచన - దర్శకత్వం - విక్రం కె కుమార్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more