Vijay | Google Wikipedia | Theri | News | Stills

Vijay india top 1 in google wikipedia

Vijay Top 1 in Google Wikipedia, Vijay Top 1 in Wikipedia, Vijay theri film, Vijay theri stills, Vijay movies, Vijay movie updates, Vijay stills

Vijay India Top 1 in Google Wikipedia: Tamil Star hero Vijay top1 place in indian google wikipedia list. Vijay Upcoming film Theri.

ఇండియాలో మహాత్ముడి తర్వాత స్థానం విజయ్

Posted: 02/04/2016 10:58 AM IST
Vijay india top 1 in google wikipedia

ఇప్పటివరకు కేవలం సినిమా తారల విషయంలో ఎక్కువ క్రేజ్ ఎవరికి వుందో ఆయా సినీ ఇండస్ట్రీల పరంగా మాత్రమే చూస్తూ వచ్చాం. ఒక్కో సినీ ఇండస్ట్రీకి ఒక్కో స్టార్ టాప్ 1 స్థానంలో నిలుస్తూ వచ్చారు. హిందీలో సల్మాన్, షారుక్... తెలుగులో మహేష్, పవన్ కళ్యాణ్... తమిళంలో విజయ్, రజనీకాంత్, సూర్య... మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి,... కన్నడంలో సుదీప్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర... ఇలా చాలా మంది పేర్లు కేవలం ఆయా ఇండస్ట్రీలకు మాత్రమే టాప్ స్థానంలో నిలుస్తూ వచ్చారు.

కానీ మొత్తం ఇండియా పరంగా చూసుకుంటే టాప్ 1 స్థానంలో ఎవరు నిలుస్తారనే విషయం అందరిలో ఉత్కంఠ కలిగిస్తూ వుంటుంది. ఇదిలా వుంటే.. సెలబ్రెటీల గూగుల్ వీకీపీడియా కూడా ఆ స్టార్ మన సౌత్ ఇండియన్ హీరోనే మరో మహాత్ముడిని చేసేసింది. అసలు ఎంటి విషయం... మహాత్ముడు ఏంటి? గూగుల్ ఏంటి అని అనుకుంటున్నారా?

అసలు విషయం ఏమిటంటే... ఇటీవలే గూగుల్ వీకీపిడియా ప్రపంచ వ్యాప్తంగా 127 మంది సెలబ్రెటీల వీకీపీడియా పేజీలను ఎడిట్ చేసారట. అంటే ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన సమాచారాలను పొందుపరచడం. అలా మనదేశంలో ఎక్కువ సార్లు ఎడిట్ చేసింది మహాత్మ గాంధీ వికీపీడియా కాగా... ఆ తర్వాత స్థానంలో తమిళ స్టార్ విజయ్ నిలిచారు.

విజయ్ వికీపీడియా పేజ్ ను ఇప్పటి వరకూ 17,736సార్లు ఎడిట్ చేసినట్లుగా వికీపీడియా వెల్లడించింది. విజయ్ కేవలం సినిమాల పరంగానే కాకుండా తన వ్యక్తిగతపరంగా కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీగా క్రేజ్ వున్న తారలలో విజయ్ కూడా ఒకరు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

ఇక విజయ్ ప్రస్తుత సినిమా విషయాలకొస్తే... విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘థేరి’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Google Wikepedia Rank  Theri  Stills  News  

Other Articles