Megastar | Chiranjeevi | shoulder surgery | Movie News | Stills

Megastar chiranjeevi to undergo shoulder surgery

Chiranjeevi to undergo shoulder surgery, Chiranjeevi shoulder surgery, Chiranjeevi surgery, Chiranjeevi surgery in mumbai, Chiranjeevi surgery details, Chiranjeevi latest news, Chiranjeevi

Megastar Chiranjeevi to undergo shoulder surgery: Tollywood Megastar Chiranjeevi is undergoing a minor shoulder surgery at the Breach Candy Hospital in Mumbai on Thursday.

ముంబాయిలో మెగాస్టార్.. భుజానికి శస్త్రచికిత్స

Posted: 02/04/2016 03:01 PM IST
Megastar chiranjeevi to undergo shoulder surgery

మెగా అభిమానులు షాక్ అయ్యే న్యూస్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఏంటి ఆ విషయం అనుకుంటున్నారా? మెగాస్టార్ చిరంజీవి మరికొద్ది రోజుల్లో శస్త్రచికిత్స చేయించుకోబోతున్నాడని ప్రస్తుతం టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం... గతకొద్ది కాలంగా చిరంజీవి భుజం నొప్పితో బాధపడుతున్నారట. ఇటీవలే వైద్యులను సంప్రదించిన చిరంజీవి... భుజానికి చిన్నపాటి ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఇక ఎలాగో ‘కత్తి’ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి మరో రెండు నెలలు సమయం పడుతుందనే వుద్దేశ్యంతో ఆపరేషన్ చేయించుకునేందుకు చిరంజీవి సిద్ధమయ్యారు.

ఈ చికిత్స కోసం చిరంజీవి ముంబైలోని బ్రీచ్ క్యాండి హాస్పిటల్లో చేరారని తెలిసింది. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ కూడా వెంట వున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం చిరంజీవికి చికిత్స జరుగుతోందని సమాచారం. దాదాపు నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచిస్తున్నట్లుగా తెలిసింది. అభిమానులకు ఈ వార్త తెలిసిన క్షణం నుంచి తమ అభిమాన హీరోకు ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. కానీ ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపినట్లుగా సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  shoulder surgery  megastar  movie news  stills  

Other Articles