Pooja Bedi angry on Kabir Bedi Parveen Dusanj

Pooja bedi angry on kabir bedi parveen dusanj

Pooja Bedi angry on Parveen Dusanj, Pooja Bedi angry tweets, Pooja Bedi latest tweets, Pooja Bedi latest news, Pooja Bedi stills, Pooja Bedi hot stills, Pooja Bedi, Kabir Bedi marriage, Kabir Bedi marriage stills, Kabir Bedi wedding stills, Kabir Bedi, Parveen Dusanj marriage stills, Parveen Dusanj hot stills, Parveen Dusanj

Pooja Bedi angry on Kabir Bedi Parveen Dusanj: Kabir Bedi marries partner Parveen Dusanj on 70th birthday. with his close friends also tied the knot with his long-time partner Parveen Dusanj.

హీరోయిన్ కు సవతి తల్లిగా మారిన ఫ్రెండ్

Posted: 01/19/2016 03:04 PM IST
Pooja bedi angry on kabir bedi parveen dusanj

బాలీవుడ్ ప్రముఖ నటుడు కబీర్ బేడీ నాలుగో పెళ్లి చేసుకొని, ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలిచాడు. ఇటీవలే తన 70వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. కబీర్ బేడీ గతకొద్ది కాలంగా తన స్నేహితురాలు పర్వీన్ దుసంజ్ (40)తో గత పదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే తాజాగా తన పుట్టినరోజున పర్వీన్ దుసంజ్ ను అగ్నిసాక్షిగా వివాహం చేసుకొని, బర్త్ డే పార్టీకి వచ్చిన వారందరికీ పెద్ద షాక్ ఇచ్చేసాడు కబీర్ బేడీ.

అయితే కబీర్ బేడీకి ఇదేం మొదటి వివాహం కాదు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని, విడాకులు ఇచ్చేసాడు. కబీర్ బేడీ మొదటి భార్య ప్రతిమా బేడీ. ఈమె ప్రసిద్ధ ఒడిస్సీ నర్తకి. కబీర్-ప్రతిమా దంపతులకు కలిగిన సంతానమే పూజాబేడి. బాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆ తర్వాత సుసాన్ హమ్ ఫ్రేస్, నిక్కీ బేడీలను కబీర్ వివాహం చేసుకొని, వారి నుంచి విడిపోయారు. వారందరితో విడిపోయాక గత పదేళ్లుగా పర్వీన్ తో కలిసి కబీర్ బేడీ సహజీవనం చేస్తున్నాడు. ఆ సహజీవనం కాస్త ఇటీవలే పెళ్లిగా మారిపోయింది.

ఇదిలా వుంటే ఈ పెళ్లిపై కబీర్ బేడి కూతురు పూజాబేడి గరం గరంగా వుంది. అసలే పూజాబేడికీ, పర్వీన్ దుసంజ్ కు మద్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ పెళ్లి కారణంతో ఆ గొడవ మరింత పెద్దగా అయ్యింది. ఈ పెళ్లి సంధర్భంగా ‘ప్రతి అద్భుత జానపద గాథలో ఒక మంత్రగత్తె కానీ, దుష్టురాలైన సవతి తల్లి కానీ ఉంటుంది. నాకిప్పుడు అలాంటి ఆవిడ వచ్చింది! పర్వీన్ దుసంజ్‌ను కబీర్ బేడీ పెళ్ళి చేసుకున్నారు’ అని పూజాబేడీ ఆదివారం ట్వీట్ చేశారు.

తండ్రీ కూతుళ్ళ మధ్య విభేదాలను బహిర్గతం చేసిన ఆ పాత ట్వీట్ సంచలనం రేపడంతో, దాన్ని తొలగించిన పూజా బేడీ కొత్తగా మరో ట్వీట్ చేశారు. ‘‘మా నాన్న గారి నాలుగో పెళ్ళి గురించి చేసిన గత ట్వీట్‌ను తొలగించాను. అంతా సానుకూలంగా చూద్దాం. ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’’ అని పూజా బేడీ ట్వీట్ చేసింది. కాగా ఈ విషయమై పూజాబేడీ వివరణనిస్తూ... ‘‘గడచిన రెండు మూడేళ్ళుగా నాకూ, మా నాన్న గారికీ మధ్య కొన్ని వ్యక్తిగత తగాదాలున్నాయి. వాటిని పరిష్కరించుకోవచ్చు. కానీ, నాకూ, పర్వీన్‌కూ మధ్య ఉన్న శత్రుత్వం వల్ల ఆ తగాదాలు పెరిగిపోయాయి. నన్ను వాళ్ళ పెళ్ళికి పిలవలేదు’’ అని చెప్పారు. మరి పర్వీన్ వల్ల తండ్రీ కూతుళ్లు కలుస్తారో లేక తండ్రి నుంచి కూతురుని పర్వీన్ విడదీస్తుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pooja Bedi  Kabir Bedi  marriage  Parveen Dusanj  stills  

Other Articles